Begin typing your search above and press return to search.
మంటపెట్టిన లక్ష్మీపార్వతి!
By: Tupaki Desk | 4 Aug 2021 12:30 AM GMTఓ పుస్తకావిష్కరణకు వచ్చి తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి మాట్లాడిన మాటలు జిల్లాలో ఇపుడు మంటలు మండిస్తున్నాయి. విషయం ఏమిటంటే పుస్తకావిష్కరణకు లక్ష్మీపార్వతి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆవిష్కరణ సందర్భంగా పుస్తకాన్ని రిలీజ్ చేసిన ఆమె అంతటితో పరిమితమైతే బాగుండేది. కానీ పుస్తకావిష్కరణ సభలో రాజకీయాలు మాట్లాడటమే ఇపుడు సమస్యగా మారింది.
ఇదే సభలో సీనియర్ నేత, ఎంఎల్ఏ ధర్మాన ప్రసాదరావు కూడా పాల్గొన్నారు. పుస్తకావిష్కరన తర్వాత ఆమె ధర్మానను ఉద్దేశించి మాట్లాడుతు ‘మీరు తొందరలోనే మంత్రి కావాలని కోరుకుంటున్న’ట్లు చెప్పారు. అసలే మంత్రిపదవి రాలేదని ప్రసాదరావు మంటగా ఉన్నారు. తొందరలోనే జరుగుతుందని అనుకుంటున్న మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళనలో తనకు స్ధానం ఉంటుందని ఆశిస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఇపుడు మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్నది ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాసే. అయితే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా మంత్రిపదవి కోసం ప్రసాదరావు కూడా ప్రయత్నం చేసుకున్నారు. అయితే సమీకరణల కారణంగా కృష్ణదాసుని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే జిల్లాకు ఒక స్పీకర్ పదవి, రెండు మంత్రిపదవులున్నాయి. కృష్ణదాసుతో పాటు సీదిరి అప్పలరాజు మంత్రివర్గంలో ఉన్నారు.
ఒకవేళ ప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే కృష్ణదాసును డ్రాప్ చేయాల్సిందే. ఇప్పటికిప్పుడు ప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే సాధ్యంకాదని అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపిగా పోటీచేసిన వైసీపీ అభ్యర్ధి ఓడిపోవటానికి ప్రసాదరావే కారణమని జగన్ కు ఫిర్యాదులందాయి. ఈ కారణంగానే ప్రసాదరావును చివరి నిముషంలో జగన్ డ్రాప్ చేసేశారు. విషయం ఇదైతే తాజాగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్ అయిపోయాయి.