Begin typing your search above and press return to search.
'బాహుబలి పెంపుడు తండ్రి' అరెస్ట్
By: Tupaki Desk | 9 Nov 2017 7:50 AM GMTబాహుబలి పెంపుడు తండ్రేమిటి?.. కేసు ఏమిటి? అంటారా? కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉందా. వివరంగా చెప్పేస్తాం. అసలు ముచ్చట ఏమిటంటే.. ఐమ్యాక్స్ మేనేజర్ గా పని చేస్తూ.. పలు సినిమాల్లో నటించిన వెంకట్ ప్రసాద్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన నటించిన పలు సినిమాల్లో బాహుబలి ఒకటి. ఈ సినిమాలో బాహుబలి పెంపుడు తండ్రిగా నటించిన ఆయన కాస్త ఫేమస్ అయ్యాడు.
అసలే నటుడు.. ఆ పై సెలబ్రిటీ హోదాతో అయ్యగారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. దాదాపు 40 సినిమాల్లో నటించిన వెంకట్ ప్రసాద్ కు అమ్మాయిల్ని వేధించే అలవాటు ఉందట. నచ్చిన అమ్మాయిని వలలో వేసుకోవటం అలవాటన్న ఆరోపణ ఉంది.
మొదటి భార్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు ప్రసాద్ మీద 2008 నుంచి కోర్టులో కేసు ఉన్నట్లు చెబుతున్నారు. తాను పని చేసే ఐమ్యాక్స్ లో జాబ్ చేసే మరో మహిళను లోబర్చుకొని మోసం చేశారన్న ఆరోపణతో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది.
ఏడాదిగా చిత్రపురి కాలనీలో ఒక ఎన్ ఆర్ ఐ మహిళతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సినిమా.. రాజకీయ రంగంలో తనకున్న పరిచయాలతో గతంలోనూ పలువురిని ఇదే తీరులో మోసం చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తనను లోబర్చుకొని మోసం చేయటంతోపాటు.. తనకు జరిగిన అన్యాయంపై నిలదీసిన ఒక మహిళను చంపేస్తానన్న బెదిరింపులకు పాల్పడినట్లుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
సెక్షన్ 430.. 354డి.. 506.. 509 సెక్షన్ల కింత కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.