Begin typing your search above and press return to search.
ప్రియురాలు మోసం.. కెనడాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
By: Tupaki Desk | 15 Nov 2020 1:00 PM GMTప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దేశం కాని దేశంలో తెలుగు యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కెనడా దేశంలో ఓ తెలుగు యువకుడు నైట్రోజన్ పీల్చి మరీ సూసైడ్ చేసుకున్నాడు. ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్ లేఖ రాసి చనిపోయాడు. చివరి క్షణంలోనూ తన వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చడం విశేషం.
హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు ప్రణయ్ పుచ్చకాయల కొంతకాలంగా కెనడాలో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న కారణంతో నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయి కూడా కెనడాలోనే ఉంటోంది.
ప్రియురాలు ఇక తనకు దక్కదన్నమానసిక వేదనను తట్టుకోలేక ప్రణయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన శవాన్ని వైద్య పరిశోధనలకు వినియోగించేలా చూడాలని తన తల్లిదండ్రులకు లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు.
ప్రణయ్ స్వస్థలం హైదరాబాద్ లోని హబ్సిగూడ. ప్రణయ్ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు. దేశం కాని దేశంలో కన్నకొడుకు ఆత్మహత్య విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.