Begin typing your search above and press return to search.
తమిళ ఎన్నికల బరిలో తెలుగు అభ్యర్థులు
By: Tupaki Desk | 12 March 2021 4:30 PM GMTఆసక్తికకరంగా సాగుతున్న తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు వారి హవా కూడా నడుస్తోంది. వాస్తవానికి తెలుగువారు పలువురు తమిళనాడులో సెటిల్ కావటం.. రాజకీయంగా మంచి పట్టు ఉండటం తెలిసిందే.తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో తెలుగు వారికి టికెట్లు దక్కుతున్నాయి. తాజాగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అన్నాడీఎంకేలో పది మంది తెలుగు వారికి టికెట్లు దక్కాయి.
అధికార అన్నాడీఎంకే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 177స్థానాల్లో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే.. తాజాగా ప్రకటించిన అభ్యర్తుల్లో పది మందికి టికెట్లు దక్కాయి. తిరుప్పూర్ జిల్లా అవినాశి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న ధనపాల్..తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి నుంచి మంత్రి కడంబూర్ రాజుకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
తిరువళ్లూరులో బీవీ రమణ.. తాంబరం నుంచి చిన్నయ్య.. క్రిష్ణగిరి జిల్లా హోసూరు నుంచి మాజీ మంత్రి బాలక్రిష్ణారెడ్డి సతీమణి జ్యోతి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో విల్లివాక్కం నుంచి ప్రభాకర్.. టి.నగర్నుంచి సత్య.. పాపిడిరెడ్డి పట్టి నుంచి గోవిందస్వామి పోటీ చేస్తున్నారు. కొళత్తూరులో డీఎంకే అధినేత స్టాలిన్ మీద పోటీ చేస్తున్నది కూడా తెలుగు వాడైన ఆదిరాజారాం పోటీ చేస్తున్నారు. చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ పోటీ చేస్తున్న ఆర్కే నగర్ నుంచి కూడా మరో తెలుగువాడైన రాజేశ్ కు అన్నాడీఎంకే పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చింది. మరి.. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.