Begin typing your search above and press return to search.
రాజుగారి అడ్డుగోలు సమర్ధన
By: Tupaki Desk | 18 July 2021 5:30 AM GMTమాన్సాస్ ట్రస్టులో జరిగిన అవినీతి, అక్రమాలకు ఆధారాలు బయటపడుతుంటే ఛైర్మన్ హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజు అడ్డుగోలుగా సమర్ధించుకుంటున్నారు. మాన్సాస్ ట్రస్టు నిర్వహణలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిధుల దుర్వినియోగంపైన ఆడిట్ చేయిస్తోంది. గడచిన 17 సంవత్సరాలుగా ట్రస్టు లెక్కలను ఆడిట్ చేయించలేదనే విషయం స్పష్టంగా బయటపడింది.
అశోక్ స్ధానంలో ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న సంచైత గజపతిరాజు ఈ విషయాన్ని అప్పట్లోనే ప్రకటించారు. ట్రస్టు ఛైర్మన్ పదవికోసం ఇటు అశోక్ అటు సంచైత మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన స్ధానంలో సంచైతను ప్రభుత్వం ఛైర్మన్ గా నియమించటంపై కోర్టులో అశోక్ కేసు వేసి గెలిచి మళ్ళీ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా మొదలైన ట్రస్టు ఆడిట్ పై చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
ట్రస్టు లెక్కలను ఆడిట్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందట. 17 ఏళ్ళుగా ఆడిట్ జరగలేదని చెప్పటం తప్పంటున్నారు. కొన్ని సంవత్సరాలు ఆడిట్ జరిగిందని ఇపుడు చెబుతున్నారు. జరిగిన ఆడిట్ గురించి సమస్యలేదు. సమస్యంతా రెగ్యులర్ గా ఎందుకు ఆడిట్ చేయించలేదనే. నిజానికి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఆడిట్ జరగాల్సిన ట్రస్టులో ఎందుకని ఆడిట్ జరగలేదనే ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
అశోక్ ఛైర్మన్ గా ఉన్న 17 ఏళ్ళలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ళుంది. ప్రభుత్వంలో ఎవరున్నా ఛైర్మన్ గా మాత్రమే అశోక్ ఉన్నది వాస్తవం. మరలాంటపుడు ఆడిట్ జరగలేదంటే అందుకు అశోకే బాధ్యత వహించాలి. అలాంటిది తన తప్పును ప్రభుత్వంపై నెట్టేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక భూముల అక్రమాలు గురించి మాట్లాడుతు కొంత భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగుండచ్చంటు సన్నా నొక్కులు నొక్కుతున్నారు.
అక్రమాలు జరిగుండచ్చని స్వయంగా అశోకే అంగీకరిస్తున్నారంటే ఏ స్ధాయిలో అక్రమాలు జరిగుంటాయో ఊహించచ్చు. పైగా టీడీపీ సీనియర్ నేతైన అశోక్ ఛైర్మన్ గా ఉన్న ట్రస్టు భూములను ఎవరికి కట్టబెట్టుంటారో ఎవరైనా ఊహించచ్చు. కాబట్టి ఆడిట్ జరిపించకపోవటం, భూ అక్రమాల్లో అశోక్ తగులుకోవటం ఖాయమనే అర్ధమవుతోంది.
మరో సారి ఎంటరైనా సంచయిత:
మాన్సాస్ ట్రస్టుకు మునుపటి ఛైర్మన్ అయిన సంచయిత గజపతి రాజు తాజా వివాదం పై స్పందించారు. సంచయిత గజపతి రాజు చేసిన ట్వీట్ ఇపుడు దుమారం రేపుతోంది.
కోర్టు తీర్పు అనంతరం ఆమె పదవి పోయాక ఆమె తొలిసారిగా స్పందించింది ఇపుడే. అశోక్ గజపతి రాజు వ్యవహారంపై మహిళా కమిషన్ ను ఆశ్రయించారు, న్యాపోరాటం చేస్తున్నారు గాని ఇంతవరకు ఆమె ఎక్కడా స్పందించలేదు.
తాజాగా మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుత చైర్మన్ అశోక్ గజపతి రాజుపై మాజీ చైర్ పర్సన్ సంచయిత సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఈవో ని బెదిరించడానికి సిబ్బందిని ప్రేరేపించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. అది కూడా మీ అన్నయ్య ఆనంద గజపతి రాజు జన్మదినం రోజున ఇలాంటి కార్యక్రమాలకు ప్రేరేపించడం మీకు సిగ్గుగా లేదా? అంటూ అశోక్ గజపతి రాజును ప్రస్తావిస్తూ సంచయిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి రాజకుటుంబం వ్యవహారం రోడ్డున పడింది అని పలువురు దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు.