Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి రైతుల వ‌ద్ద‌కు వైసీపీ ఎంపీ - చ‌ల్లార్చే ప్ర‌య‌త్న‌మే?

By:  Tupaki Desk   |   31 Jan 2020 5:30 PM GMT
అమ‌రావ‌తి రైతుల వ‌ద్ద‌కు వైసీపీ ఎంపీ - చ‌ల్లార్చే ప్ర‌య‌త్న‌మే?
X
అమ‌రావ‌తిలో దాదాపు నెల రోజుల పై నుంచినే దీక్ష‌లు చేస్తున్న రైతుల శిబిరాల్లో తొలిసారి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత క‌నిపించారు. ఆయ‌నే లావు శ్రీకృష్ణదేవ‌రాయలు. అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల‌కు సంఘీభావం ప్ర‌క‌టిస్తూ ఆయ‌న అక్క‌డ మాట్లాడారు. మంద‌డం లోని దీక్షా శిబిరాన్ని ఈ ఎంపీ సంద‌ర్శించారు. ముందుగా అక్క‌డ‌కు చేరుకున్న ఆయ‌న‌ను రైతులు అడ్డుకున్నంత ప‌ని చేశారు. మాట్లాడ‌నీయ‌కుండా నినాదాలు చేశారు. రాజ‌ధాని అంతా అమ‌రావ‌తిలోనే ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న చేయాల‌ని వారు నినాదాలు చేశారు. వారు అరిచినంత‌సేపూ కామ్ గా ఉండిపోయిన ఈ ఎంపీ ఆ త‌ర్వాత స్పందించారు.

అమ‌రావ‌తి రైతుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చాడు కృష్ణ‌దేవరాయ‌లు. సీఎం జ‌గ‌న్ రైతుల ప‌క్ష‌పాతి అని, ఆయ‌న త‌ప్ప‌కుండా న్యాయం చేస్తార‌ని హామీ ఇచ్చారు. రైతులు తాము చెప్ప‌ద‌లుచుకున్న‌ది ఏమిటో ప్ర‌భుత్వానికి చెప్ప‌వ‌చ్చ‌ని ఆయ‌న వివ‌రించారు. రైతుల దీక్ష‌కు వ్య‌క్తిగ‌తంగా త‌ను సంఘీభావం ప్ర‌క‌టిస్తున్న‌ట్టుగా ఈ ఎంపీ ప్ర‌క‌టించారు.

ఒక‌వైపు అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల్లో తెలుగుదేశం పార్టీ క‌నిపించ‌డం లేదిప్పుడు. మూడు రాజ‌ధానుల‌పై అతిగా వ్య‌వ‌హ‌రిస్తే..అటు ఉత్త‌రాంధ్ర‌, ఇటు రాయ‌ల‌సీమ‌ల్లో వ్య‌తిరేక‌త ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని తెలుగుదేశం పార్టీకి అర్థం అయిన‌ట్టుంది. అలాగే.. మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యంతో జ‌గ‌న్ తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి గురించి మాట్లాడ‌టం లేదు. ఆయ‌న త‌న ఆఫీసుకు ప‌రిమితం అయిన దాఖ‌లాలు క‌నిపిస్తూ ఉన్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అమ‌రావ‌తి రైతుల వ‌ద్ద‌కు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఆందోళ‌న‌ల బాట ప‌ట్టిన రైతుల‌ను చ‌ల్లార్చి, వారితోస‌యోధ్య‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింద‌ని స్ప‌ష్టం అవుతూ ఉంది. ఇప్ప‌టికే అమ‌రావ‌తి రైతుల‌కు ప్ర‌భుత్వం చెల్లించే కౌలుమొత్తాన్ని పెంచారు. దీంతో నిజ‌మైన రైతులు ల‌బ్ధి పొందుతారు. ఎటొచ్చీ భూమ‌ల ధ‌ర‌లు, రియ‌లెస్టేట్ అనుకునే వాళ్లు మాత్రం ఇప్ప‌టికీ అసంతృప్తితో ఉండ‌వ‌చ్చు. ఏదేమైనా ఆ వ్య‌వ‌హారాన్ని అలా వ‌దిలేయ‌కుండా.. క్లియ‌ర్ చేయ‌డానికి అధికార పార్టీ రంగంలోకి దిగిన‌ట్టుగా ఉంద‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆందోళ‌న కారులు తెలుగుదేశం పార్టీని కాకుండా, ప్ర‌భుత్వాన్ని న‌మ్ముకోవాల‌ని ఇన్ డైరెక్టుగా సూచిస్తున్న‌ట్టుగా వారిని డైరెక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్టుగా ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.