Begin typing your search above and press return to search.
అమెరికాలో తెలుగు అమ్మాయి సత్తా .. కోవిడ్ పై ఆవిష్కరణకు పురస్కారం !
By: Tupaki Desk | 15 Oct 2020 3:00 PM GMTకరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాలని వణికిస్తుంది. కరోనాతో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ తయారీలో పూర్తిగా నిమగ్నమైయ్యారు. త్వరలోనే కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి సమయంలో కరోనా చికిత్సకు ఉపకరించే ఆవిష్కరణపై పనిచేసిన 14 ఏళ్ల టెక్సాస్ బాలిక జాతీయ అవార్డును గెలుచుకుంది.
తెలుగమ్మాయి అనిక చేబ్రోలు ఇండిపెండెన్స్ హైస్కూల్ లో చదువుతూ ఇటీవల 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ లోనూ గెలుపొంది 25,000 డాలర్లను సొంతం చేసుకున్నారు. తాను అభివృద్ధి చేసిన ఈ అణువు సార్స్ కరోనా వైరస్ పై ఒక నిర్దిష్ట ప్రోటీన్ ను నిలువరిస్తుందని తన ఆవిష్కరణపై అనిక చేబ్రోలు తెలిపారు. ఈ ప్రొటీన్‌ను బంధించడం ద్వారా ఇది వైరస్ ప్రోటీన్ పనితీరును ఆపివేస్తుందని, దీన్ని తాను 682 మిలియన్ కాంపౌండ్ల డేటాబేస్ తో ప్రారంభించానని అన్నారు.
కొద్ది నెలల కిందట ఈ పోటీలో ఆమె పొల్గొన్న సమయంలో ఆమె మిడిల్ స్కూల్ లో ఉన్నారు. తొలుత స్వైన్ ఫ్లూపై తన ప్రాజెక్టును రూపొందించుకోగా ఆపై కరోనాపై పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్ బారినపడటంతో తన ప్రాజెక్టు విస్తృతి దృష్ట్యా కరోనా పై పరిశోధనను ఎంపిక చేసుకున్నానని అనిక చెప్పారు. తాను స్కూల్ విద్యను ముగించిన తర్వాత వైద్య పరిశోధకురాలిగా కెరీర్ ను ఎంచుకుంటానని తెలిపారు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తాత ప్రోత్సాహంతో తనకు సైన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పారు.