Begin typing your search above and press return to search.
అమెరికా మొగుడా...తర్వాత చూద్దాం లే !
By: Tupaki Desk | 27 May 2018 9:43 AM GMTఅమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది.....అబ్బాయికి నెలకు నాలుగు లక్షల జీతం.....హెచ్-4 డిపెండెంట్ వీసా మీద అమ్మాయి కూడా అమెరికా వెళ్లాక ఉద్యోగం చేసుకుంటుంది.....తల తాకట్టు పెట్టయినా సరే భారీ మొత్తంలో కట్నం సమర్పించుకొని ఈ సంబంధం ఖాయం చేసేయాలి....అసలే అమెరికా సంబంధాలకు విపరీతమైన డిమాండ్ ఉంది మార్కెట్లో......నిన్న మొన్నటి వరకు అమెరికా సంబంధం కావాలనుకునే సగటు భారతీయ తల్లిదండ్రుల ఆలోచనాధోరణి ఇలానే ఉంది. అమెరికా వరుడి కోసం మ్యాట్రిమొనీ సైట్లతో, మ్యారేజ్ బ్యూరోలలో తెగ వెతికేవారు. అయితే, తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకోనున్న తింగరి నిర్ణయాలతో ఆ ట్రెండ్ మారుతోంది. ట్రంప్ పుణ్యమా అంటూ అమెరికా సంబంధం మాకొద్దు బాబోయ్....అన్న తరహాలో అమ్మాయిల తల్లిదండ్రుల ఆలోచనా సరళి మారిందంటే అతిశయోక్తి కాదు. ఎన్నారై మొగుళ్లు మాకొద్దు బాబోయ్....అని దక్షిణాది...ప్రత్యేకించి తెలుగమ్మాయిలు అంటున్నారు. హెచ్-4 వీసాపై వచ్చే హెచ్-1బీ వీసా భాగస్వాములు ఉద్యోగాలు చేయకూడదంటూ ట్రంప్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోండడమే ఇందుకు కారణం.
అమెరికాలో పనిచేస్తోన్న హెచ్1-బి వీసాదారుల భాగస్వాములు.....హెచ్-4వీసాపై అమెరికా వచ్చే వీలుంది. అలా హెచ్-4 డిపెండెంట్ వీసాపై వచ్చే వారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు 2012లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుమతించారు. దీంతో, భారతీయులు...అందులోనూ ప్రత్యేకించి దక్షిణాది నుంచా చాలామంది అమెరికాబాట పట్టారు. దీంతో, అమెరికా సంబంధాలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉండేది. అయితే, అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అనే లోకల్ సెంటిమెంట్ ను బలంగా విశ్వసిస్తోన్న ట్రంప్ హెచ్-4 వీసాపై వచ్చే భాగస్వాములు ఉద్యోగాలు చేసేందుకు వీలు లేకుండా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నారు. హెచ్1-బి వీసాదారుల భాగస్వాములకు అమెరికాలో పని అనుమతి(వర్క్ పర్మిట్) జారీపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ యోచిస్తున్నారు. ఏ క్షణంలో ట్రంప్ ఏ రూల్ పెడతారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో, అమెరికాలోనే ఉన్న అమ్మాయిలు..అబ్బాయిల మధ్య సంబంధాలు సెట్ చేసేందుకు అక్కడి తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు,దక్షిణాది రాష్ట్రాల్లో....ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల తల్లిదండ్రులు.... సివిల్ సర్వీసెస్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, వైద్యులు, వ్యాపారవేత్తల సంబంధాలు కుదరుర్చుకునేందుకు ఇష్టపడుతున్నారని మ్యాట్రిమొనీ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే 93 శాతం మంది భారతీయులు ఇబ్బంది పడతారని అమెరికాకే చెందిన మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్(ఎంపీఐ) తెలిపింది. హెచ్-4 వీసాలు పొందిన భాగస్వాముల్లో 90 శాతం మంది భారతీయులేనని, వారిలో 94 శాతం మంది హెచ్1బి వీసాదారుల భార్యలేనని తెలిపింది. వీరిలో అధిక శాతం దక్షిణాదికి, ఎక్కువగా తెలుగు వారున్నట్లు చెప్పింది.