Begin typing your search above and press return to search.

ఏం చేస్తారు? ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌-30లో తెలుగుకుర్రాళ్లు

By:  Tupaki Desk   |   8 Feb 2022 4:30 AM GMT
ఏం చేస్తారు? ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌-30లో తెలుగుకుర్రాళ్లు
X
తెలుగు కుర్రాళ్లు అదరగొట్టేశారు. తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌-30లో చోటు సంపాదించారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం అందించేందుకు వారు ఏర్పాటు చేసిన సంస్థ ఇప్పుడో అపన్న హస్తంగా మారింది. నాగపూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ముగ్గురు కుర్రాళ్లు (అనిల్ కుమార్ రెడ్డి, సందీప్ శర్మ, సారంగ్ బోబాడే)హైదరాబాద్ కేంద్రంగా తమ సంస్థను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ కేంద్రంగా ‘‘డొనేట్ కార్ట్.కామ్’’ను స్టార్ట్ చేశారు. ఈ వెబ్ సైట్ లో.. కష్టాల్లో ఉన్న వారు ఎవరైనా సరే.. తమ ఇబ్బందులను తెలియజేస్తూ వివరాలు నమోదు చేసుకునే వీలు ఉంుటంది. తమకున్న అవసరాల్ని అందులో పేర్కొనొచ్చు. ఇలాంటి వారి వివరాలతో దాతలు స్పందించే వీలుంది.

ఈ ముగ్గురు కుర్రాళ్లు స్టార్ట్ చేసిన ఈ వెబ్ సైట్ ద్వారా రూ.70 కోట్ల వరకు సాయం అందించారు. ఈ భారీ మొత్తంలో దాదాపు రూ.55 కోట్లు వరకు కొవిడ్ బాధితులకు అందజేశారు.

వీరు చేస్తున్న కార్యక్రమాలతో తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి సంస్థ ఉన్న టీహబ్ ఆ వివరాల్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. సరికొత్త ఆలోచనలతో కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు ఈ తెలుగు కుర్రాళ్లు చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అభినందించాల్సిందే.