Begin typing your search above and press return to search.
ఐసిస్ టార్గెట్ లో తెలుగు అధికారులు
By: Tupaki Desk | 2 Aug 2016 9:34 AM GMTప్రపంచవ్యాప్తంగా బీతావహ దాడులకు పాల్పడుతున్న ఐసిస్ ఉగ్రవాదులు భారతదేశంపై దృష్టిపెట్టారా? దేశ వ్యాప్తంగా అధికారులపై ఐఏఎస్ ఉగ్రవాదులు గురిపెట్టారా? రాజకీయ నేతలతోపాటు వారిని కూడా టార్గెట్ చేయాలని భావిస్తున్నారా? ఈ లిస్ట్ లో తెలుగువారు కూడా ఉన్నారా?అంటే పోలీసు వర్గాలు అవుననే అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు ఈ చర్చలో ప్రముఖంగా తెరమీదకు రావడం కలకలం రేపుతోంది.
ఇటీవల కాలంలో దేశంలో ఐసిస్ - ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటుండగా, తాజాగా అల్ ఖైదా ఇండియన్ కాంటినెంట్ (ఎక్యూఐసి) పేరుతో మరో సంస్థ కూడా తెరపైకి వచ్చినట్లు గుర్తించారు. ఈ సంస్థకు హసీమ్ ఒమర్ దేశంలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్నట్లు కూడా గుర్తించారు. అతను పాకిస్తాన్ లేదా ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అల్ ఖైదాకు అనుబంధంగా ఈ సంస్థ పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మూడువారాల క్రితం నిఘా సంస్థలకు ఎక్యూఐసికి చెందిన ఒక ఆడియో సందేశం కాపీ లభించినట్లు తెలిసింది. ఇందులో రాజకీయ వేత్తలు - అధికారులపై మాట్లాడిన అంశాలు కూడా పోలీసులకు చిక్కింది.
అధికారులు లక్ష్యంగా చేయనున్న దాడులపై ఐసిస్ వ్యాఖ్యలు కాకతాళీయమా - కావాలనే చేసారా! అన్నది నిర్ధారణ కాకపోయినప్పటికీ, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ భద్రతా సిబ్బందిని ఉపయోగించకుండానే పర్యటనలు చేస్తుండటంతో నిఘా అధికారులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. భద్రత విషయంలో జాగ్రత్త తప్పనిసరి ఆయనకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వీలయినంత వరకు అధికారులకు భద్రత పెంచాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది.