Begin typing your search above and press return to search.
దేశ భాషలందు తెలుగు 'లెస్సు' కాదు..
By: Tupaki Desk | 16 July 2018 5:07 AM GMTఇక గర్వంచ వచ్చు మన భాష మరణిస్తోందనే భయాలను తొలగించుకోవచ్చు. పొరుగు భాష కంటే మెరుగ్గా ఉందని కాసింత గర్వపడచ్చు. దేశంలో తెలుగు భాషకు నాలుగో స్దానం దక్కినందుకు ఆనందపడచ్చు. 2011 వ సంవత్సరంలో తేల్చిన జనాభా లెక్కల్లో ఈ విషయం వెల్లబడైంది. ఏడు సంవత్సారాలు ఆలస్యమైన తెలుగు వారికి తీపి కబురు అందింది. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషగా హిందీ మొదటి స్దానం దక్కించుకుంది. రెండవ స్దానంలో బెంగాలీ - మూడవ స్దానంలో మరాఠీ ఉన్నాయి. ఆ తర్వాత స్దానం తెలుగుదే కావడం విశేషం.
నిరంతరం భాష పట్ల ప్రేమ, శ్రధ్ద చూపించే తమిళ భాష మన తర్వాత స్దానంలో ఉంది. దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఐటి కంపెనీలు వచ్చిన తర్వాత తల్లి భాషలకు ప్రాధాన్యం తగ్గింది. పరాయి భాష ఇంగ్లీష్ మన నెత్తిన కూర్చుంది. ఇద్దరు తెలుగువారు కలిస్తే ఇంగ్లీషులో మాట్లాడుకుంటారు అనే నానుడి వచ్చింది. ప్రభుత్వ - ప్రైవేటు పాఠశాలలో తెలుగు బోధించడమే తగ్గిపోయింది. పిల్లలు - యవతీ యువకులు మాకు తెలుగు రాదంటూ గొప్పలు చెప్పుకునే పరిస్దిత వచ్చింది. ప్రభుత్వాలు కూడా తెలుగు భాషను వీలున్నంత నాశనం చేస్తున్నాయి.
ప్రభుత్వ కార్యలయాలలో తెలుగులోనే కార్యకలాపాలు నిర్వహించాలన్న ఉత్తర్వులను ఇంగ్లీషులో ఇవ్వడం విషాదం. 2011 నాటి లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 8.11కోట్లమంది తెలుగు మాట్లడేవారున్నారు. మన తెలగు భాషను పరిరక్షించుకునేందుకు తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. పాఠశాలలోను - కళాశాలలోను. విశ్వవిద్యాలయాలలోను తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్దులంతా విధిగా తెలుగు నేర్చుకునేలా మాట్లాడేలా, రాసేలా చర్యలు తీసుకోవాలి. పోలీసు స్టేషన్లు - న్యాయస్దానాలు - ప్రజలు ఎక్కవగా వినియోగించే ప్రభుత్వ కార్యలయాలలోనూ తెలుగు భాషనే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. ఇలా పటిష్టమైన చర్యలు తీసుకుంటే తెలుగు భాష మూడవ స్దానానికో, రెండవ స్దానానికో ఎగబాకడం పెద్ద కష్టమేమీ కాదు.