Begin typing your search above and press return to search.

దేశంలో 4వ స్థానంలోకి తెలుగు మాట్లాడేవారు..

By:  Tupaki Desk   |   30 Jun 2018 8:49 AM GMT
దేశంలో 4వ స్థానంలోకి తెలుగు మాట్లాడేవారు..
X
దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో ఇన్నాళ్లు తెలుగు మూడో స్థానంలో ఉండేది.. ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయిందని తాజాగా విడుదలైన ఓ జనాభా లెక్కల సర్వే తేల్చింది . ఆ సర్వేలో దేశ జనాభాలో దాదాపు 8.1 కోట్ల మంది ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారని.. వీరి శాతం 9.1గా తేల్చారు. ఇక తెలుగును నాలుగో స్థానానికి నెట్టి మరాఠీ భాష మూడో స్థానానికి చేరుకుందని సర్వే తేల్చింది. మరాఠీ మట్లాడే వారి సంఖ్య దేశంలో 8.3 కోట్లకు చేరింది.

ప్రస్తుతం దేశంలో చూస్తే హిందీ మాట్లాడే వారు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో బెంగాలీ వారు ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే భారతదేశంలో ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.

కానీ తెలుగు భాషా వేత్తలు, నిపుణులు మాత్రం ఈ లెక్కలను ఖండిస్తున్నారు. దేశంలో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారే 3వ స్థానంలో ఉన్నారని.. కేవలం సర్వేలో తెలుగు రాష్ట్రాల్లోని వ్యక్తులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని.. ఖరగ్ పూర్ - భిలాల్ - ఒడిషా - కర్ణాటకలోని తెలుగు ప్రజలందరినీ పరిగణలోకి తీసుకుంటే తెలుగు మాట్లాడే ప్రజలు దేశంలోనే 2వ లేదా 3వ స్థానంలో ఉంటారని వారు ఘంటాపథంగా చెబుతున్నారు.