Begin typing your search above and press return to search.

అవినాశ్ ప్రచారం: నాడు వైసీపీ.. నేడు ట్రంప్!

By:  Tupaki Desk   |   6 Nov 2016 4:10 AM GMT
అవినాశ్ ప్రచారం: నాడు వైసీపీ.. నేడు ట్రంప్!
X
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు అవినాశ్ ఇరగవరపు. ఇప్పుడు "మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌" నినాదంతో అధ్యక్ష పదవి బరిలోకి దిగిన రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తోన్న ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆంధ్రుడు. ఈయన ప్రస్తుతం అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో రిపబ్లికన్‌ పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఇన్‌ చార్జ్‌ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు పుట్టిపెరిగిందంతా పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరులో.

నిన్న వైసీపీకి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వ్యక్తి, నేడు అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ కి ఎన్నికల ప్రచారం, వ్యూహాలు చేయడం చిన్నవిషయం కాదు! అయితే ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై అవినాశ్‌ కు కాలేజీ రోజుల నుంచే ఆసక్తి ఉందట. ఈ విషయాలను తాజాగా అమెరికాలోని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వులో అవినాశ్ వివరించాడు!

అవినాశ్ భార్య ఇంటెల్‌ ఉద్యోగట.. 2014లో భారత్ లోని ఎన్నికలు ముగిసిన అనంతరం ఆమెను కలవడానికి అమెరికా వచ్చిన అవినాశ్.. అతని ఇఇంటి దగ్గర్లో ఒక రోడ్‌ సైన్‌ చూశాడట. చాండ్లర్‌ సిటీ కౌన్సిల్‌ కు త్వరలో ఎన్నికలు జరగబోతున్నట్టు తెలిపే సైన్‌ అది! అనంతరం అరిజోనా గవర్నర్‌ ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసుకున్న అవినాశ్... ఎన్నికల ఫలితాల డేటాను విశ్లేషించి, అరిజోనా గవర్నర్‌ గా డౌగ్‌ డూసీ గెలుస్తాడని ఊహించి అతడి ప్రచారకర్తలకు లేఖ రాశాడట. అనంతరం అవినాశ్ ఊహించినట్లు, అంచనా వేసినట్లుగానే డూసీ గెలవడంతో ఇతడి డేటా విశ్లేషణకు అరిజోనా రిపబ్లికన్‌ పార్టీ చైర్మన్‌ రాబర్ట్‌ గ్రాహం నుంచి ప్రశంసలు వచ్చాయట. అనంతరం అనతికాలంలోనే అరిజోనాలో పార్టీ డేటా డైరెక్టర్‌ పదవి నుంచి పొలిటికల్‌ డైరెక్టర్‌ గా, తర్వాత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా ఎదిగాడు.

కాగా, లఖ్నవ్ ఐఐఎం నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్న అవినాశ్... హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ లో ఉద్యోగంలో చేరాడు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి వైకాపా తరుపున ప్రచార కార్యక్రమాలు చేశారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/