Begin typing your search above and press return to search.

మందులపై ఇక తెలుగు పేర్లు .. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   14 July 2020 8:30 AM GMT
మందులపై ఇక తెలుగు పేర్లు .. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !
X
సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం తెచ్చుకునే మందు డబ్బాలపై ఇంగ్లీష్ లో పేర్లు ఉంటాయి. ఆలా ఇంగ్లీష్ లో పేర్లు ఉండడంతో ఏ జబ్బు కి ఏ మందు వేసుకోవాలని అర్ధం చేసుకోవడం సామాన్యులకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో సామాన్యులకు మందుల పై అవగాహన పెంచేందుకై తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో రోగులకు ఇచ్చే మందులపై తెలుగులో లోనూ ముద్రించి అందజేయడం మొదలుపెట్టింది.

వేసుకునే మందుల పేర్లు తెలియడంతో పాటు సులువుగా చదువుకోవడం, ఏ మందు ఎందుకు ఉపయోగపడుతుందో కూడా సామాన్యులకు తెలిసేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. తెలంగాణ ఆరోగ్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.