Begin typing your search above and press return to search.

బాబు మాట కన్నా కేసీఆర్ మాట‌కే విలువెక్కువ‌!

By:  Tupaki Desk   |   15 May 2018 5:30 PM GMT
బాబు మాట కన్నా కేసీఆర్ మాట‌కే విలువెక్కువ‌!
X
క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డడంతో అక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోగ‌తం ఏమిటో దేశం మొత్తానికి అర్థమైంది. మెజారిటీ ఓట‌ర్లు కాంగ్రెస్ గెల‌వాల‌ని ఆ పార్టీకే ఓటువేశారు. బీజేపీకి కాంగ్రెస్ క‌న్నా 2 శాతం ఓట్లు త‌క్కువ వ‌చ్చినప్ప‌టికీ ఎక్కువ సీట్లు రావ‌డం గ‌మ‌నార్హం. అయితే, కన్న‌డ నాట ఎన్నిక‌ల‌లో తెలుగు ఓట‌ర్ల ప్ర‌భావం ఎంత ఉంద‌న్న సంగ‌తి ప‌క్క‌న‌బెడితే...ఈ ఎన్నిక‌ల్లో ప‌రోక్షంగా టీడీపీ, టీఆర్ ఎస్ లు కూడా ఇన్ వాల్వ్ అయ్యాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీని ఓడించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. మ‌రోవైపు జేడీఎస్ కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల నేప‌థ్యంలో క‌న్న‌డ నాట తెలుగు ప్ర‌జ‌లు....చంద్ర‌బాబు మాట‌క‌న్నా కేసీఆర్ మాట‌కే విలువ ఎక్కువ ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. జేడీఎస్ కు 38 సీట్లు రావ‌డం....కాంగ్రెస్ కు 78 సీట్లు మాత్ర‌మే రావ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

క‌ర్ణాట‌కలో తెలుగు ప్ర‌జ‌లు నివ‌సించే ప్రాంతాల వారు బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటువేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. అయితే, క‌న్న‌డ నాట ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్లు కాక‌పోయినా..... బీజేపీకి ఎక్కువ సీట్లు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ కు త‌క్కువ సీట్లు వ‌చ్చాయి. దీంతో, పరోక్షంగా క‌న్న‌డ‌నాట తెలుగు ప్ర‌జ‌లు ...చంద్ర‌బాబు మాట క‌న్నా....కేసీఆర్ మాట‌కు విలువ ఇచ్చార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. బాబు క‌న్నా కేసీఆర్ పైనే ఎక్కువ న‌మ్మ‌కముంచార‌ని అర్థ‌మ‌వుతోంది. కేసీఆర్ తోపాటు ఎంఐఎం అధినేత ఒవైసీ కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా జేడీఎస్ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశారు. వీరిద్ద‌రితో పోలిస్తే....చంద్ర‌బాబు ఇమేజ్ అక్క‌డ పెద్ద‌గా ప‌నిచేయ‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది. ఏపీకి బీజేపీ అన్యాయం చేసింద‌ని....బాబు చెప్పిన క‌ల్ల‌బొల్లి మాట‌ల‌ను అక్క‌డి తెలుగు ప్ర‌జ‌లు న‌మ్మ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. నాలుగేళ్ల‌పాటు బీజేపీని ప్ర‌శ్నించిన బాబు...స‌డెన్ గా యూట‌ర్న్ తీసుకొని....హోదా ను భుజానికెత్తుకోవ‌డాన్ని అక్క‌డి తెలుగు ప్ర‌జ‌లు న‌మ్మ‌లేదు.