Begin typing your search above and press return to search.

తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు: చంద్రబాబు

By:  Tupaki Desk   |   28 May 2022 10:30 AM GMT
తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు: చంద్రబాబు
X
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని.. తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన చంద్రబాబు నివాళులు అర్పించారు.అంతకముందు ఆయన భారీ వాహన ర్యాలీతో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్‌ చేశారు.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారు. పేదవారికి ఏం కావాలో తెలుసుకుని అందించిన మహా వ్యక్తి. మహానాడులో భాగంగా సాయంత్రం బహిరంగ సభలో జిల్లా సమస్యలు ప్రస్తావిస్తా. ఒంగోలులో అభివృద్ధి జరిగిందంటే దామచర్ల జనార్దన్‌ కృషే. మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని బస్సులకు అనుమతి ఇవ్వలేదు. తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరని జగన్‌ తెలుసుకోవాలి.

బహిరంగ సభకు రాకుండా అడ్డుకునేవాళ్లకు ఒక్కటే చెబుతున్నా. సాయంత్రం బహిరంగ సభకు ఎంతమంది వస్తారో చూడండి. అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. జనాలు రావాలనుకుంటున్న మహానాడుకు బస్సుల్ని ఇవ్వకుండా.

ప్రభుత్వం ఎవరూ లేని యాత్రకు బస్సుల్ని తిప్పుతోందని.. చంద్రబాబు ఎద్దేవా చేశారు. మహానాడుకు ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు.. బస్సులకు అనుమతి ఇవ్వలేదన్నారు. తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.

ఎన్టీఆర్ కు వైసీపీ ఘ‌న నివాళి!తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరెన్నికగ‌న్న‌ మహానటుడు ఎన్టీఆర్ అని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేప‌ల్లిలో ఆయ‌న ఎన్టీఆర్‌కు ఘ‌న నివాళి అర్పించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 73 ఏళ్లకే ఎన్టీఆర్ కు నూరేళ్లు నిండాయని అన్నారు. మహానాడు వేదికగా కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుంటున్నారు అని, ... బడుగు బలహీన వర్గాలకు ఏం చేస్తారో చెప్పారా? అని చంద్ర‌బాబును నిలదీశారు.

సీఎం జగన్ పై దుర్భాషలాడడం తప్ప మహా నాడులో చంద్రబాబు ఏం చేస్తారో చెప్పడం లేదు అన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి రివర్స్ టెండరే కారణం అని చంద్రబాబు మహానాడు లో అసత్య ప్రచారం చేస్తున్నారు అని మండి పడ్డారు. చంద్రబాబు చారితాత్మక తప్పిదం తప్ప తమ వల్ల కాదని, దీనిపై తాము చర్చకు సిద్ధం అని సవాలు విసిరారు.