Begin typing your search above and press return to search.
సింగిల్ గా ఉండేందుకే తెలుగోళ్లు సై
By: Tupaki Desk | 26 Aug 2015 5:30 PM GMTతాజాగా వెలువడిన ఒక సర్వే వివరాలు కాస్తంత ఆశ్చర్యంగానూ.. ఆసక్తికరంగా ఉన్నాయి. దేశం మొత్తం ఒకతీరుగా ఉంటే.. తెలుగు ప్రాంతం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం ఒక విశేషం. ప్రజల మైండ్ సెట్ చాటి చెప్పేలా సరికొత్త ట్రెండ్ గురించి వివరాలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. తెలుగు ప్రాంతానికి చెందిన యూత్.. పెళ్లి.. పిల్లలు లాంటి బాదరబందీలకు దూరంగా ఉండాలన్న తహతహ పెరిగిపోతుందట.
చదువు.. ఉద్యోగం.. పెళ్లి లాంటి వాటిల్లో మొదటి రెండింటికి ఓకే అనుకున్నా.. మూడో విషయంలోనే తెలుగోళ్లు భిన్నంగా వ్యవహరిస్తున్నారట.
పెళ్లి మాట ఎత్తకుండా బతుకు బండి లాగించేస్తున్నారట. ఇది అబ్బాయిలే కాదు.. అమ్మాయిల్లోనూ ఇదే ట్రెండ్ అట.అంతేకాదు.. పెళ్లి చేసుకున్నా.. పిల్లా..పీచు అన్నది లేకుండా జంటగా బతికేయటం కూడా ఓ అలవాటుగా మారిందని చెబుతున్నారు. నీల్సన్.. ఇండికస్ ఎనాలిటిక్స్ చేసిన తాజా అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయట. దేశంలో ఇలా చిత్రమైన ట్రెండ్ లో తెలుగోళ్లు మొదటి స్థానంలో ఉంటే.. లక్షదీప్ లో అతి తక్కువగా ఉన్నారట. తెలుగోళ్లు 10.51లక్షల మంది ఉంటే.. లక్షద్వీప్ లో 653 మందే ఉన్నారట. మన తర్వాత తమిళనాడులో 9.80లక్షలు.. మహారాష్ట్రలో 9.77లక్షలు.. యూపీలో 8.55లక్షల మంది సింగిల్ గా లైఫ్ బాగుందంటున్నారట. ఇక.. ఆరుగురు అంతకంటే ఎక్కువమంది కుటుంబ సభ్యులున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ టాప్ లో ఉంటే..రాజస్థాన్ చివరిలో ఉందట. చూస్తుంటే.. ఈ సింగిల్ జీవితం రానున్న రోజుల్లో మరెన్ని సామాజిక సమస్యలకు కారణమవుతుందో..?