Begin typing your search above and press return to search.
తెలుగోళ్లకు హ్యాండిస్తే ఎంత మండిద్దో మోడీకి చెప్పాల్సిందే
By: Tupaki Desk | 8 March 2018 5:56 AM GMTనోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట ఇవ్వలేం కదా. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు భవిష్యత్తు పరిణామాలు.. పరిస్థితుల్ని ఆలోచించి మాట్లాడేలా కానీ.. ముందు అయితే మాట ఇచ్చేద్దాం.. తర్వాత తూచ్ అందామన్నట్లుగా వ్యవహరించే వాళ్లకు తగిన శాస్తి చేయాల్సిన అవసరం ఉంది.
గతంలోపాలకుల మీద కోపం వస్తే.. రోడ్ల మీదకు వచ్చి నిరసనలు.. ఆందోళనలు చేసే పరిస్థితి. మారిన కాలానికి తగ్గట్లు.. డిజిటల్ యుగంలో పాలకుల దొంగ హామీలకు దిమ్మ తిరిగేలా నిరసన షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏపీకి ఇవ్వాల్సిన హోదా మీద మోడీ సర్కారు చేస్తున్న అడ్డగోలు వాదనలు.. నమ్మించి మోసం చేసిన తీరుకు తగిన రీతిలో తెలుగుప్రజలు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది.
తప్పు చేసినోళ్లకు.. తప్పుడు మాటలు చెప్పినోళ్ల విషయంలో తెలుగు ప్రజలు ఎంత సీరియస్ గా ఉంటారన్న విషయాన్ని మోడీ పరివారానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం.. బాధ్యత ఉంది. ఇందుకోసం పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు. ఏపీకి హోదా విషయంలో మోడీ ఇచ్చిన హామీ వీడియో బిట్ ను.. మోడీ ట్విట్టర్ ఖాతాకు.. బీజేపీ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేయాల్సిందే. అంతేనా.. హోదా విషయంలో విభజన బిల్లు సమయంలో పార్లమెంటులో వెంకయ్య చెప్పింది.. ఇప్పుడు జైట్లీ చెబుతున్న వీడియోలను బీజేపీ.. వారి పరివారంతో పాటు.. సంఘ్ పరివార్ కు చెందిన సోషల్ ఖాతాల్లో కూడా ట్యాగ్ చేయాల్సిన అవసరం ఉంది. నీతులు చెప్పే నేతల మాటల్లో తేడా ఎంతన్నది దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడే.. ఏపీకి హోదా ఇస్తే.. వేరే రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయనే తొండి వాదనకు చెక్ పెట్టినట్లు అవుతుంది. అయినా.. వాళ్లెవరో అడుగుతారని.. ఆకలితో నకనకలాడుతున్న వారికి తిండి పెట్టకుండా చంపేస్తారా?