Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తెలుగోడి సీన్ ఎంత‌?

By:  Tupaki Desk   |   9 May 2018 4:48 AM GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తెలుగోడి సీన్ ఎంత‌?
X
రాష్ట్రం కాని రాష్ట్రంలో మ‌రో రాష్ట్రానికి చెందిన ప్ర‌జ‌లు రాజ‌కీయాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రా? అంతిమ ఫ‌లితాల్ని మార్చేయ‌గ‌ల‌రా? అన్న ప్ర‌శ్న‌ల‌కు సానుకూల స‌మాధానం రాదు. కానీ.. క‌ర్ణాట‌క రాజ‌కీయం మీద అవ‌గాహ‌న ఉన్న వారు మాత్రం త‌మ నోటి నుంచి తొంద‌ర‌ప‌డి వ్యాఖ్య‌లు చేయ‌టం ఉండ‌దు. ఎందుకంటే.. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగోళ్ల ఓటు ప్ర‌భావం అక్క‌డి రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేయ‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే తుది ఫ‌లితాన్ని మార్చేయ‌గ‌ల స‌త్తా వారికి ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

మ‌రో నాలుగు రోజుల్లో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ ద‌శకు తెర లేవ‌నుంది. పోలింగ్ ముగిసిన మూడు రోజుల‌కే ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వెల్ల‌డి కానుంది. 12న పోలింగ్ జ‌రుగుతుండ‌గా.. 15న ఫ‌లితం వెలువ‌డ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కూ సాగుతున్న ఊహాగానాలు.. జోస్యాలు మ‌రో వారం వ్య‌వ‌ధిలో తేలిపోవ‌ట‌మే కాదు.. స‌రికొత్త విజేత ఎవ‌రో తేలిపోనుంది. ఒక రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలు జాతీయ రాజ‌కీయం మీద ప్ర‌భావం చూపించ‌టం చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు జాతీయ రాజ‌కీయం మీద‌నా ప్ర‌భావం చూపించటం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ ల‌కు ఎంతో కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం హంగ్ అసెంబ్లీ అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఏపార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెబుతున్న వేళ‌.. తెలుగోళ్ల ఓట్లు తుది ఫ‌లితానికి కీల‌కం కానున్నాయి.

ఎందుకిలా అంటే.. పోటాపోటీగా సాగుతున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో గెలుపు ఓట‌మిల మ‌ధ్య వ్య‌త్యాసం రెండు.. మూడు శాతానికి మించి ఉండ‌దు. అలాంటిది క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తెలుగోళ్లు 15 శాతం వ‌ర‌కూ ఉన్నార‌ని మ‌ర్చిపోకూడ‌దు. రాష్ట్రం మొత్త‌మ్మీదా 40 నుంచి 50 స్థానాల్లో తెలుగువారు త‌మ ప్ర‌భావాన్ని ప‌క్కాగా చూపిస్తార‌ని చెబుతున్నారు. క‌ర్ణాట‌క‌లోని 12 జిల్లాల్లో తెలుగువారు ఎక్కువ‌గా ఉన్నారు.

త‌మ‌కురు.. చిత్ర‌దుర్గ‌.. బీద‌ర్‌.. బెంగ‌ళూరు సిటీ.. బెంగ‌ళూరు రూర‌ల్‌.. బ‌ళ్లారి.. కొప్ప‌ల్‌.. రాయ‌చూర్.. క‌ల‌బురిగి.. యాద్ గిరి.. కోలార్.. చిక్ బ‌ళ్లాపూర్ ల‌లో తెలుగువారు ఎక్కువ‌. వారు వేసే ఓట్లు తుది ఫ‌లితం మీద క‌చ్ఛితంగా ప్ర‌భావం చూపించ‌నున్నాయి. మొత్తం 12 జిల్లాల్లో కోలార్ లో అయితే 76 శాతం ఓట‌ర్లు తెలుగు మాట్లాడేవారు కావ‌టం గ‌మ‌నార్హం. అచ్చంగా తెలుగు ఓట‌ర్ల విష‌యానికి వ‌స్తే.. బీద‌ర్‌.. క‌ల‌బురిగి.. కోలార్.. బ‌ళ్లారిలో 30 శాతం మంది కావ‌టం విశేషం. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 25 ల‌క్ష‌ల మంది తెలుగోళ్లు ఉన్నారు. దీంతో.. వారి ఓట్లు తుది ఫ‌లితం మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపించ‌నున్నాయి.

ప‌లువురు వ్యాపారులు.. ఐటీ ఉద్యోగులు.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు.. హోటల్ నిర్వాహ‌కుల‌తోపాటు వివిధ రంగాల‌కు చెందిన తెలుగువారు ఎక్కువ‌గా ఉండ‌టంతో.. వారి ప్ర‌భావం ఎన్నిక‌ల మీద స్ప‌ష్టంగా కనిపిస్తుంద‌ని చెబుతున్నారు. క‌ర్ణాట‌క‌లో మొత్తం 224 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌ర‌గ‌నున్న పోలింగ్ లో విజ‌యం ఎక్కువ భాగం 5వేల మెజార్టీలోపే ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ వాద‌న‌కు గ‌త చ‌రిత్ర కోసం అండ‌గా నిలుస్తోంది. 2008 ఎన్నిక‌ల్లో 68 సీట్లు 5వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 2013లో 49 స్థానాల్లో 5 వేల కంటే త‌క్కువ మెజార్టీతోనే విజ‌యం సొంత‌మైంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో తెలుగోళ్లంతా మోడీ వ్య‌తిరేక ఓటు వేస్తే.. బీజేపీకి దిమ్మ తిరిగిపోవ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. తెలుగోళ్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.