Begin typing your search above and press return to search.
స్టాండ్ బై వికెట్ కీపర్ గా తెలుగుబిడ్డకు అవకాశం..!
By: Tupaki Desk | 20 May 2021 9:30 AM GMTభారత జట్టు త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోతున్న విషయం తెలిసిందే.అక్కడ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడటంతో పాటు ఇంగ్లాండ్ జట్టుతో 5 టెస్ట్ లు ఆడనుంది. అయితే ఈ జట్టులో ఆంధ్రక్రికెటర్ కోన శ్రీకర్ భరత్ కు చోటు దక్కింది. అదనపు వికెట్ కీపర్ గా శ్రీకర్ భరత్ ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనున్నాడు.
కరోనా బారిన పడ్డ బెంగాల్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇటీవలే కోలుకున్నాడు. అయితే ఒకవేళ అతడు గాయపడితే మరో వికెట్ కీపర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో భరత్‌కు అవకాశం దక్కింది. ఇప్పటికే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వికెట్ కీపర్లుగా ఉన్నారు. అయితే పంత్ శ్రీలంకలో జరిగే సీరిస్ లో ఆడేందుకు వెళ్తుండటంతో సాహాకు ఈ సారి అవకాశం దక్కింది.
అదనపు వికెట్ కీపర్ గా భరత్ కు చాన్స్ వచ్చింది. వృద్ధిమాన్ సాహా .. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి అతడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. మరోవైపు మరో వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఆస్ట్రేలియా టూర్ లో అద్భుతంగా రాణించాడు. అతడిని మరో ధోనీ అంటూ అంతా కొనియాడారు.
అంతేకాక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో ఆ జట్టు కెప్టెన్‌గా పంత్ కు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని పంత్ ఎంతో చక్కగా ఉపయోగించుకున్నాడు. అతడి కెప్టెన్సీని సెహ్వాగ్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ప్రశంసించారు. మరోవైపు టీమిండియాలో పంత్ స్థానం పదిలంగా మారింది.
ఐపీఎల్ ఆడుతున్న టైంలోనే వృద్ధిమాన్ సాహాకు కరోనా సోకింది. దీంతో అతడు ఢిల్లీలో క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నాడు. అయితే తాజాగా సాహాకు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో అతడు ఇంగ్లండ్ టూర్ కు వెళ్లనున్నాడు.