Begin typing your search above and press return to search.

ఈయ‌న్ను సీఎం చేసేది తెలుగు సెటిల‌ర్లే!

By:  Tupaki Desk   |   3 Oct 2019 7:36 AM GMT
ఈయ‌న్ను సీఎం చేసేది తెలుగు సెటిల‌ర్లే!
X
పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నామినేష‌న్‌కు ముందు నుంచే ఆస‌క్తిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ బీజేపీ-శివ‌సేన క‌లిసి బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 21న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి - సీఎం పదవిని కైవసం చేసుకోవాలని శివసేన ప్రణాళికలు రచిస్తున్నట్లుగా చెప్తున్నారు. దీంట్లో భాగంగానే తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ఎన్నికల బరిలోకి పార్టీ అధ్యక్షుడు ఉద్ధ్దవ్‌ ఠాక్రే దింపారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆదిత్య సీఎం కావాలంటే...తెలుగువారి ఓట్లే కీల‌కం కావ‌డం గ‌మ‌నార్హం.

వర్లి నియోజకవర్గంనుంచి ఆదిత్య థాకరే పోటీ చేస్తున్నారు. నామినేషన్‌ దాఖలు సమయంలో మొత్తం థాకరే కుటుంబమంతా ఆదిత్య థాకరే వెంట ఎన్నికల సంఘం కార్యాలయానికి వస్తుందని భావిస్తున్నారు.ఇక నామినేష‌న్ కంటే ముందే...ఆదిత్య వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు సహా ఇతర భాషల్లో ప్రచారం చేస్తున్నారు. వర్లీ ఏరియాలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకోడానికి ఆయన ‘‘నమస్తే వర్లీ’’అంటూ పలకరించారు. గుజరాతీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో గుజరాతీ భాషలో, ముస్లిం మెజార్టీ ఏరియాల్లో ఉర్దూలో హోర్డింగ్లు ఏర్పాటుచేశారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తును నిర్దేశించేది తెలుగువారే కావ‌డం విశేషం.

ఇదిలాఉండ‌గా, శివసేన పార్టీని 1966లో బాల్‌ఠాక్రే ఏర్పాటు చేసినప్పటి నుంచి.. ప్రభుత్వాలను వెనుకనుంచి నియంత్రించటమేగానీ, ఆ కుటుంబం నుంచి ఎవరూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టి తొలిసారిగా ఆదిత్య.. ఎన్నికల బరిలో వర్లీ నుంచి పోటీ పడనున్నారు. శివసేన భారీ మెజార్టీ సాధిస్తే కాబోయే సీఎం ఆదిత్యనే అని ఆ పార్టీ ఇప్ప‌టికే ప్రచారం చేస్తుండ‌టం కొస‌మెరుపు.