Begin typing your search above and press return to search.

తెలుగు క‌మ‌ల‌నాథుల రిక్వెస్ట్ కు షా ఓకే!

By:  Tupaki Desk   |   2 July 2019 3:33 AM GMT
తెలుగు క‌మ‌ల‌నాథుల రిక్వెస్ట్ కు షా ఓకే!
X
కొన్నిసార్లు అంతే. చాలామంది ప‌ట్టించుకోని వ్య‌క్తి ఉన్న‌ట్లుండి పెద్ద పొజిష‌న్లోకి వ‌చ్చేస్తాడు. ఒక్క రోజులో జ‌రిగిన విచిత్రంతో అలాంటిది చోటు చేసుకోదు. కానీ.. ఆ విష‌యాన్నిఎవ‌రూ ప‌ట్టించుకోరు. కాకుంటే అప్ప‌టిక‌ప్పుడు అంద‌రి అటెన్ష‌న్ స‌ద‌రు పొజిష‌న్లో ఉన్న వ్య‌క్తి మీద పెరుగుతుంది. తెర మీద క‌నిపించే సీన్ కు తెర వెనుక క‌నిపించే సీన్లు ఎన్నో ఉంటాయి. తాజాగా అలాంటిదే తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఢిల్లీలో జ‌రుగుతోంద‌ని చెబుతున్నారు.

సోనియా గాంధీ ఏరికోరి నియ‌మించిన ఒక గ‌వ‌ర్న‌ర్.. మోడీ పాల‌న‌లోనూ కొన‌సాగ‌టం ఒక ఎత్తు అయితే.. మ‌రోసారి త‌న ప‌ద‌వీకాలం పొడిగింపు అయ్యేలా చేసుకోవ‌టం అంత తేలికైనా విష‌యం కాదు. అలాంటి విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ టాలెంట్ గా చెప్పాలి. ఢిల్లీలో సంబంధాలు మొయింటైన్ చేయ‌టంలో చురుగ్గా ఉంటూ.. ఎప్ప‌టిక‌ప్పుడు ఢిల్లీ పెద్ద‌ల అవ‌స‌రాల్ని తీర్చే విష‌యంలో ఏ మాత్రం లోటు చేయ‌ని ఆయ‌న‌.. లోక‌ల్ చిన్నోళ్ల‌ను చిన్న‌బుచ్చేలా చేయ‌టం ఇప్పుడు ఆయ‌న‌కో తల‌నొప్పిగా మారింది.

మీకేం.. మీ ద‌గ్గ‌ర‌కు వచ్చి తియ్య‌తియ్య‌గా మాట్లాడ‌తారు. మ‌మ్మ‌ల్ని చూడ‌ను కూడా చూడ‌రంటూ రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన బీజేపీ నేత‌లు ప‌లువురు బీజేపీ అధినాయ‌కత్వానికి ఫిర్యాదు చేయ‌టంతో ప‌దేళ్లుగా పాతుకుపోయిన గ‌వ‌ర్న‌ర్ సాబ్ పీఠాన్ని క‌దిలించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి.

తెలంగాణ ముఖ్య‌మంత్రికి జానీ జిగిరీ దోస్త్ గా ఉండే న‌రసింహ‌న్ కార‌ణంగా త‌మ‌కు ద‌క్కాల్సిన రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ద‌క్కే అవ‌కాశం లేద‌న్న మాట‌తో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు వేర్వేరు గ‌వ‌ర్న‌ర్ల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రాన్ని తెలుగు రాష్ట్రాల‌కు చెందిన బీజేపీ నేత‌లు అదే ప‌నిగా ప్ర‌స్తావించ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతోంది.

మొన్న‌టివ‌ర‌కూ ఈ విష‌యానికి పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌ని బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తెలంగాణ‌లో నాలుగు ఎంపీ సీట్ల‌ను సొంతం చేసుకున్న వేళ‌.. తెలంగాణ ఇప్పుడు ప్ర‌యారిటీ లిస్ట్ లో ముందు వ‌రుస‌లోకి వ‌చ్చిన నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ కు స్థాన‌చ‌ల‌నం త‌ప్ప‌నిస‌రి అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎవ‌రికి వారుగా పాల‌న సాగిస్తున్న వేళ‌.. గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో ఉమ్మ‌డి అవ‌స‌రం లేద‌ని.. రెండు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌న్న బీజేపీ నేత‌ల మాట‌ల‌కు ఢిల్లీ నాయ‌క‌త్వం ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే పార్ల‌మెంటు స‌మావేశాల అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ స్థాన‌చ‌లనం ఉంటుందంటున్నారు. చిన్నోళ్లు పెద్దోళ్లు అయ్యే వ‌ర‌కూ వెయిట్ చేయ‌కుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు అలెర్ట్ గా ఉంటూ జాగ్ర‌త్త‌గా ఉండే న‌ర‌సింహ‌న్ మాష్టారు.. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌ల విష‌యంలో కాస్త దూరం పాటించార‌ని.. అదే ఇప్పుడాయ‌న పీఠాన్ని క‌దిలేలా చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.ప‌దేళ్లుగా పాతుకుపోయిన న‌ర‌సింహ‌న్ పీఠం.. తాజాగా మాత్రం మార‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.