Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్లు.. ప్రొటోకాల్ పట్టింపులు
By: Tupaki Desk | 23 Aug 2022 2:30 AM GMTసమ్మున్నతమైన భారత రాజ్యాంగం ప్రకారం దేశాధిపతి రాష్ట్రపతి కాగా. . రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రథమ పౌరులు. ఈ పాత్రలో తమదైన ముద్ర వేసినవారు ఉన్నారు. అత్యంత వివాదాస్పదులైన వారూ ఉన్నారు. రాజకీయాలకు సంబంధం లేనివారిని తొలుత గవర్నర్లుగా నియమిస్తే.. ఇటీవల నేరుగా రాజకీయ నాయకులనే గవర్నర్లను చేస్తున్నారు. ఇది కాలక్రమంలో వచ్చిన మార్పుగా చూడాలి.
ఇక కొందరు గవర్నర్లు తమదైన నిర్ణయాలతో వార్తల్లో నిలిస్తే మరికొందరు వివాదాస్పదులయ్యారు. కొందరు లెఫ్టినెంట్ గవర్నర్లూ కీలక పాత్ర పోషించిన ఉదాహరణలున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్.. ప్రస్తుతం సంచలనం రేపిన మద్యం కుంభకోణాన్ని సీబీఐకి ఆదేశించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ తనదైన నిర్ణయాలతో ముద్ర చాటారు.
ఏపీలో 40 ఏళ్ల కిందట రామ్ లాల్
ఉమ్మడి ఏపీలో గవర్నర్ గా రామ్ లాల్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో రామ్ లాల్ పోషించిన పాత్రపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఆయనను రామ్ లాల్ కాదు రావణ్ లాల్ గానూ అభివర్ణించారు. అయితే, తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వ పునరుద్ధరణ సంగతి వేరే విషయం. ఇక ఆ తర్వాత వచ్చినవారెవరూ అంతగా వార్తల్లో నిలవలేదు. శంకర్ దయాళ్ శర్మ, క్రిష్ణ కాంత్ చాలా హుందాగా ఉండేవారు. అయితే, ఎన్డీ తివారీ తీరు మాత్రం సంచలనమైంది. ఆయన స్థానంలో వచ్చిన నరసింహన్ అత్యంత సమర్థులుగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల విభజన కూడా నరసింహన్ హయాంలోనే జరిగింది. రెండు రాష్ట్రాలకు ఆయనే గవర్నర్ గానూ వ్యవహరించడం జరిగింది.
తమిళిసై తో కేసీఆర్ సర్కారు ఢీ
నరసింహన్ స్థానంలో తెలంగాణకు డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ గవర్నర్ గా వచ్చారు. స్వతహాగా మంచి డాక్టరైన ఆమె.. అందుకుతగ్గట్లే ప్రజలతోనూ మమేకం అవుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకు ప్రొటోకాల్ కల్పించకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ .. మేడారం జాతర సహా భద్రాచలంలో వరద బాధితుల పర్యటనలకు వెళ్లారు. ఆఖరికి బాసర ట్రిపుల్ ఐటీకి కూడా వెళ్లి అక్కడ విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. మరోవైపు పంద్రాగస్టు వేడుకల అనంతరం నిర్వహించే ఎట్ హోంకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం గమనార్హం. దీనిని చూసినవారు టీఆర్ఎస్ సర్కారుతో రాజ్ భవన్ కు మరింత దూరం పెరిగిందని వ్యాఖ్యానించారు.
దత్తాత్రేయ తరహానే వేరు
ప్రస్తుతం తెలుగువారిలో గవర్నర్లుగా ఉన్నది ఇద్దరు. ఒకరు హరియాణ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ. రెండోవారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు. వీరిద్దరూ 2014- 19 మధ్య ఎంపీలుగా వ్యహరించారు. హరియాణ గవర్నర్ గా ఉన్న దత్తాత్రేయ తరచూ స్వస్థలం హైదరాబాద్ వస్తుంటారు. ఇదివరకు హిమాచల్ గవర్నర్ గా పనిచేసిన కాలంలోనూ అక్కడి వాతావరణ పరిస్థితుల రీత్యా ఎక్కువగా హైదరాబాద్ వచ్చేవారు. కాగా, ఏపీలో దత్తాత్రేయకు ప్రొటోకాల్ విషయంలో చిన్న వివాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి శివాలయం వద్ద ఆదివారం అభయహస్త పరమశివుడి విగ్రహావిష్కరణకు ఆయన రాగా.. కారును 150 మీటర్ల దూరంలోనే నిలిపేయడంపై ప్రొటోకాల్ పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. దత్తాత్రేయ కాన్వాయ్ మెయిన్ బజారు నుంచి గాలిగోపురం సమీపానికి చేరుకుంది. అయితే.. ఇనుప గడ్డర్లను అధికారులు తొలగించలేదు.
దీంతో దత్తాత్రేయ కారు దిగి కాలినడకన ఆలయంలోకి వెళ్లారు. విలేకర్లు డీఎస్పీ రాంబాబును వివరణ కోరగా తమకు సంబంధం లేదంటూనే.. ఆలయ ఈవోతో ఫోన్లో మాట్లాడారు. కాన్వాయ్ విషయంలో ఎవరైనా ఒకటే అని సమాధానం వచ్చినట్లు తెలిసింది. దీనిపై విలేకరులు ఈవోను ప్రశ్నించగా తమకు గవర్నర్ పర్యటన గురించి చెప్పలేదని, ఎవరి వాహనమైనా దూరంగా ఆపాల్సిందేనని చెప్పారు. ఇతర వాహనాలకు ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించగా ఏ వాహనమూ రాదని చెప్పారు. అప్పటికే ఆలయం చుట్టూ ఆటోలు, పోలీసు వాహనాలు ఉన్నాయి. తిరిగి వెళ్లే సమయంలోనూ గవర్నర్ నడిచి వెళ్లాల్సిందేనా అని ప్రశ్నించగా కంగారుపడ్డ ఈవో గవర్నర్ వాహనాన్ని వేదిక వద్దకు తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు.