Begin typing your search above and press return to search.
వివాహేతర హత్యల్లో తెలుగు రాష్ట్రాలు టాప్!
By: Tupaki Desk | 24 Sep 2017 5:10 AM GMTగతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా వివాహేతర సంబంధాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎందుకిలా అంటే కారణాల చిట్టా విప్పుతున్నారు నిపుణులు. కారణాలు ఏవైనా బంధాల మధ్య అనుబంధం మోతాదు అంతకంతకూ తగ్గిపోతోంది. బయట ఆకర్షణలు అంతకంతకూ ఎక్కువై.. కొత్తదనం కోసం పాకులాడటం ఎక్కువైంది. కట్ చేస్తే.. వివాహేతర సంబంధాలు కాస్తా క్రైం ఎపిసోడ్లుగా మారిపోతున్నాయి.
ఎగ్జైట్ మెంట్ కోసం.. మరింత తృఫ్తి కోసం స్టార్ట్ అయ్యే వివాహేతర సంబంధాలు చివరకు హత్యల వరకూ వెళుతున్నాయి. దేశ వ్యాప్తంగా వివాహేతర సంబంధాలు హత్యలుగా టర్న్ తీసుకుంటున్న వైనంపై ఒక సర్వేను నిర్వహించారు. ఇందులో షాకింగ్ వాస్తవం ఒకటి బయటకు వచ్చింది. రెండేళ్ల క్రితం (2015) నిర్వహించిన ఈ సర్వేలో వివాహేతర సంబంధాల కారణంగా అధికంగా హత్యలు జరుగుతున్న రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ ఫైవ్ లో లిస్ట్ కావటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు.
అధికారిక గణాంకాల ప్రకారం వివాహేతర సంబంధాలు కారణంగా అధికంగా హత్యలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిస్తే.. తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్క 2015లోనే ఏపీలో 1099 హత్యలు జరిగితే.. అందులో వివాహేతర సంబంధాల కారణంగా జరిగిన మర్డర్లు ఏకంగా 198. తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఇక.. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో 156 హత్యలు జరిగాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉండటం గమనార్హం.
ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. గడిచిన మూడేళ్లలో హైదరాబాద్ మహానగరంలో నమోదైన 1891 గృహహింస కేసుల్లో వివాహేతర సంబంధాల కారణంగా నమోదైనవి ఏకంగా 40 నుంచి 50 శాతం మేర ఉండొచ్చని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న లక్షలాది విడాకుల కేసుల్లో 20 శాతం కేసులు వివాహేతర సంబంధాల కారణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జీవిత భాగస్వామిని నమ్మకం.. నేనున్నానన్న భరోసాను ఇవ్వటం.. బంధానికి నమ్మకం అనే ఇంధనాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వటం అవసరం. పెరిగిన ఆకర్షణల సుడిగుండాల్లో చిక్కుకోకుండా భార్య..భర్త ఇద్దరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.