Begin typing your search above and press return to search.

భారీ మెజార్టీల్లో తెలుగోళ్లే టాప్

By:  Tupaki Desk   |   25 Nov 2015 5:25 AM GMT
భారీ మెజార్టీల్లో తెలుగోళ్లే టాప్
X
వరంగల్ ఉప ఎన్నిక ఫలితం అనూహ్యంగా ఉండటంతో పాటు.. చారిత్రక విజయాన్ని నమోదు చేయటం తెలిసిందే. తెలంగాణ అధికార పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే. మూడు లక్షల మెజార్టీ వస్తుందంటే.. అది కాస్తా 4.59లక్షల మెజార్టీ రావటం.. దేశంలో అత్యధిక మెజార్టీల్లో 8వ స్థానంలో నిలవటం జరిగింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. దేశంలో లోక్ సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టాప్ టెన్ లిస్ట్ చూస్తే.. తెలుగోళ్లే ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది.

దేశవ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించిన తొలి పది మెజార్టీల్లో తెలుగువారివే ఐదు ఉండటం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టాప్ టెన్ మెజార్టీల్లో మూడు రాయలసీమకు చెందితే.. మరో రెండు తెలంగాణకు చెందినవి. ఈ మూడింటిలో తండ్రి కొడుకుల రికార్డు కూడా ఉంది. భారీ మెజార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొమ్మిదో స్థానంలో నిలిస్తే.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ జాబితాలో ఐదో స్థానంలో నిలవటం గమనార్హం.

ఇంకో చిత్రమైన విషయం ఏమిటంటే.. గురువు కంటే శిష్యుడే భారీ మెజార్టీతో విజయం సాధించటం. టాప్ టెన్ జాబితాలో టెన్త్ పొజిషన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఉంటే.. ఆయన శిష్యుడైన పసునూరి దయాకర్ తాజా ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. అంటే.. గురువు కంటే రెండు స్థానాలు పైనే ఉండటం.

ఇక.. టాప్ టెన్ జాబితా చూస్తే..

1. ప్రీతమ్ ముండే (బీజేపీ) 2014 6.92 లక్షలు

2. అనిల్ బోస్ (సీపీఎం) 2004 5.92 లక్షలు

3. పీవీ నరసింహారావు (కాంగ్రెస్) 1991 5.80 లక్షలు

4. నరేంద్ర మోడీ (బీజేపీ) 2014 5.70 లక్షలు

5. వైఎస్ జగన్ (వైఎస్సార్ కాంగ్రెస్) 2011 5.45 లక్షలు

6. దర్శనా జర్దోష్ (బీజేపీ) 2014 5.33 లక్షలు

7. రాంవిలాస్ పాశ్వాన్ (జనతాదళ్) 1989 5.04 లక్షలు

8. పసునూరి దయాకర్ (టీఆర్ ఎస్) 2015 4.59 లక్షలు

9. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (కాంగ్రెస్) 1991 4.22 లక్షలు

10. కేసీఆర్ (టీఆర్ఎస్) 2014 3.97 లక్షలు