Begin typing your search above and press return to search.
అలవాటు చేశారుగా.. అనుభవించక తప్పదు!!
By: Tupaki Desk | 22 Dec 2022 12:30 AM GMTఇదీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వినిపిస్తున్న వాదన. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నానా తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. అమ్మ ఒడి, చేయూత.. సహా ఇతరత్రా పథకాలు.. ప్రజలకు మేలు చేస్తున్నాయని చెబుతున్నా రు. దీంతో ఏటా అప్పులు తెచ్చి మరీ అధిక మొత్తంలో ప్రజలకు పంచుతున్నారు.
అయితే.. నిజానికి ఈ సంక్షేమం విషయంలో ఒకప్పుడు హద్దులు ఉండేవి. కొన్నింటి వరకే పరిమితం అయ్యేది. ఏదో కొన్ని అల్పాదాయ, పేదరికంలో మగ్గుతున్న వర్గాలకు మాత్రమే సంక్షేమం అందేది. దీంతో ప్రభుత్వాలపై పెద్దగా బర్డెన్ పడేది కాదు. అందులోనూ.. ఏటా అల్పాదాయవర్గాలపై సమీక్ష చేసే యంత్రాంగం ఉండి.. దానిని పాటించడంతో ఈ లబ్ధిదారుల సంఖ్యలోనూ మార్పులు జరిగేవి.
ఫలితంగా ప్రజలు కూడా ప్రభుత్వాలపై ఆధారపడే పరిస్థితి ఉండేది కాదు. తమ పనితాము చేసుకునే వారు. కానీ, రాను రాను.. ఈ పరిస్థితి వైఎస్ హయాం నుంచి మారిపోయింది. ఆ తర్వాత.. తాజాగా ఏపీలో సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు.. ప్రజలను మరింతగా ప్రభుత్వంపై ఆధారపడేలా చేస్తున్నాయి. చేశాయి కూడా. ఇప్పుడు దీనివల్ల ఏంటి నష్టం? అంటే.. ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. రాష్ట్రమే నష్టపోతోంది.
అంతేకాదు, ఒకప్పుడు మేం అది ఇస్తాం.. మేం అధికారంలోకి వస్తే.. ఇది ఇస్తాం.. అని చెప్పుకొన్న పార్టీల ను చూశారు కదా.. కానీ, ఇప్పుడు ఏపీలో ట్రెండ్ మారిపోయింది. ప్రజలే తమకు ఏం కావాలో చెబుతున్నారు. కొన్ని చోట్ల డిమాండ్ కూడా చేస్తున్నారు.
పింఛనును 5000 లకు పెంచాలని, ఇప్పుడున్న పథకాలను మరింత మందికి అమలు చేయాలని. ఇలా డిమాండ్లు వింటుంటే.. నేతలకు మతి పోతోంది. అయినా.. కూడా ఏం చేస్తారు? అలవాటు చేశారుకాబట్టి..ఇప్పుడుఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.