Begin typing your search above and press return to search.
అమెరికా స్టూడెంట్ వీసాల్లో తెలుగు రాష్ట్రాలే టాప్!
By: Tupaki Desk | 10 Sep 2022 5:35 AM GMTఇందుగలడు.. అందులేరని సందేహం వలదు.. అగ్రరాజ్యం అమెరికా అంతటా ఎందెందు వెతికినా భారతీయులే కలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ అంతలా విస్తరించారు మనోళ్లు. ఇక అమెరికా కూడా భారతీయుల ప్రతిభకు దాసోహమై చాలా మందికి వీసాలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు అమెరికాకు వెళ్లాలనుకున్న భారతీయుల కలకు అండగా నిలుస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతీయులకే అమెరికా అత్యధిక వీసాలు అందజేస్తోంది.
అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు అత్యధిక వీసాలు ఇచ్చింది. కోవిడ్ 19 లాక్డౌన్ నుంచి దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఖజానాను నింపడానికి విదేశీ విద్యార్థుల కోసం దాని విద్యా సంస్థలను తెరిచింది. దీని ప్రకారం ఇటీవలి కాలంలో తొలిసారిగా భారత్‌కు చెందిన 82 వేల మంది విద్యార్థులకు అమెరికా అడ్మిషన్లు ఇచ్చింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, వీటిలో 40 శాతం (సుమారు 33,000) వీసాలు రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ విద్యార్థులకు ఇవ్వడం విశేషం.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ప్రపంచంలోని ఇతర దేశాల విద్యార్థులతో పోలిస్తే ఈ ఏడాది భారతీయ విద్యార్థులే అత్యధిక వీసాలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు గత కొంతకాలంగా ఉన్నత విద్య కోసం అమెరికా వైపు చూస్తున్నారు. కోవిడ్ 19కి ముందు వీసాలు పెద్దగా ఇవ్వలేదు. కోవిడ్ తగ్గడంతో విద్యార్థి వీసాలు ఈ సంవత్సరం ఉదారంగా ఇస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అమెరికా తన యూనివర్సిటీలను ప్రారంభించింది. ఆర్థిక సంక్షోభంతో పాటు, అమెరికాలో మానవశక్తి కొరతను కూడా ఎదుర్కొంటోంది. భారతీయ విద్యార్థులు దశాబ్దాలుగా అమెరికాకు విధేయులుగా ఉన్నారు. వారు అమెరికా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. చైనీయులలాగా అమెరికా టెక్నాలజీని, రహస్యాలను మాతృదేశానికి తరలించడం లేదు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కావడంతో భారత్ ను నమ్మి అమెరికా ప్రోత్సహిస్తోంది. అందుకే అమెరికా భారతీయ విద్యార్థులకు వీసాలు ఇవ్వడానికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది..
ఇది ఖచ్చితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్‌లు దీని వల్ల మెరుగ్గా సంపాదిస్తాయి. అంతే కాదు అమెరికాలో కనీసం 25% మంది తెలుగు విద్యార్థులు సినిమా ప్రేమికులు కావడం వల్ల తెలుగు సినిమా కూడా అమెరికాలో మునుపటి కంటే కొంచెం మెరుగ్గా విస్తరించి కలెక్షన్లు రాబట్టడానికి దోహదపడుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.