Begin typing your search above and press return to search.

కరోనా ట్రాకింగ్: ఏపీ - తెలంగాణ ఏం చేశాయి?

By:  Tupaki Desk   |   5 April 2020 7:00 AM GMT
కరోనా ట్రాకింగ్: ఏపీ - తెలంగాణ ఏం చేశాయి?
X
కరోనాను నియంత్రణలో ఏపీ - తెలంగాణ రెండు రాష్ట్రాలు టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నాయి. క్వారంటైన్ లో ఉన్నకరోనా రోగులు - అనుమానితులను టెక్నాలజీ సాయంతో నిఘా పెట్టి నియంత్రించాయి.

ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాలు ఫోన్ నంబర్ల ద్వారా - కొన్ని రాష్ట్రాలు ప్రతీ గంటకు సెల్ఫీ పంపుమని రోగులను కోరుతూ వారిని కంట్రోల్ చేస్తున్నాయి. ఇక పోలీసులు - ఆరోగ్య కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి ప్రతిరోజు అటెండెన్స్ వేసుకుంటున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం యాప్ తో ట్రాక్ చేయడం విశేషం. తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘25వేల మంది తెలంగాణలో హోం క్వారంటైన్ లో ఉన్నారని.. వారందరినీ జియో ట్యాగింగ్ చేసి వారి ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని కోవిడ్-19 యాప్ తో ట్రాక్ చేస్తున్నామని’ తెలిపారు. ఇక ఏపీ ప్రభుత్వం రోగుల ట్రాకింగ్ కోసం ‘ఆరోగ్య ఆంధ్ర’ అనే యాప్ ను సృష్టించింది. హోం క్వారంటైన్ లో ఉన్న వారి వివరాలు తీసుకొని ట్రాక్ చేస్తున్నట్టు ఏపీ అధికారులు తెలిపారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటూ దేశంలోనే కరోనా నియంత్రణలో హైటెక్ పోకడలు పాటిస్తున్నాయి. క్వారంటైన్ లో ఉన్న వారికి పాజిటివ్ వస్తే వారి మొబైల్ కాల్ రికార్డ్స్ ట్రాక్ చేసి మరీ వారు కలిసిన వారిని ట్రేస్ చేయడం విశేషం.. ఈ ప్రక్రియ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.