Begin typing your search above and press return to search.
యోగి వ్యూహకర్త ఓ తెలుగు ఆయన ! వావ్ వావ్
By: Tupaki Desk | 11 March 2022 3:30 AM GMTఇవాళ దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్న ఒకే ఒక్క మాట యోగి విజయం.ఆయన విజయం అనూహ్యం.అనితర సాధ్యం కూడా! ఆయన విజయాలకు కారణం మన తెలుగు వ్యక్తే అని చెప్పడం ఎంతో గర్వకారణం.
సత్యకుమార్ అనే వ్యక్తి తెలుగు బిడ్డ కావడం తోనే కాదు ఆంధ్రుల ప్రతినిధిగా ఉంటూ యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పడం అన్నది కమలనాథుల అనిర్వచనీయ అనుభూతికి కూడా ఇవాళ సంకేతిక. జాతీయ కార్యవర్గంలో కీలక బాధ్యతలు మోస్తున్న ఆయన కడప జిల్లా, ప్రొద్దుటూరు వాసి. పలు ఎన్నికల సభల్లో ఆయన వెంటే ఉన్నారు.ఇవాళ అంతా ప్రశాంత్ కిశోర్ జపం చేస్తుంటే బీజేపీ మాత్రం ఆయన్ను కాదని మన తెలుగింటి తేజం పేరు స్మరించడం అన్నది మనందరికీ గర్వకారణం.
ఇక యోగి విజయంకు మరో కారణం ఆయన శాంతి భద్రతలను కట్టడి చేయడంలో అనూహ్య విజయం సాధించడం. దీనిపై ఇరు తెలుగు రాష్ట్రాలూ నేర్చుకోవాల్సి ఎంతో! అదేవిధంగా మహిళల భద్రతలో ఎప్పుడూ వెనుకంజలో ఉంటున్న తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో కూడా యోగిని అనుసరించాల్సిందే! ఈ రెండు ప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు పోవడం అన్నది ఇవాళ మనందరి ముందున్న ఓ గొప్ప లక్ష్యం కావాలి.
ఇరు తెలుగు రాష్ట్రాల పెద్దలూ వీటిపై దృష్టి సారించడం అత్యావశ్యక పరిణామం. ఇక ఆ రోజు విజయానికి కారణాలు ఏమయి ఉన్నాయి అన్నవి సత్య కుమార్ లాంటి వారే చెప్పాలి. త్వరలో ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎనీవే ఇవాళ ఆయన బర్త్ డే కూడా.. హ్యాపీ బర్త్ డే సర్.