Begin typing your search above and press return to search.

మోదీని నవ్వుల్లో ముంచెత్తిన తెలుగు కుర్రోడు!

By:  Tupaki Desk   |   30 Aug 2020 4:00 PM GMT
మోదీని నవ్వుల్లో ముంచెత్తిన  తెలుగు కుర్రోడు!
X
ఓ తెలుగు విద్యార్థి సరదా సంభాషణ ప్రధాని మోదీనే నవ్వుల్లో ముంచెత్తింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో నూతనంగా నిర్మించిన రాణీ లక్ష్మీ బాయి వ్యవసాయ విశ్వ విద్యాలయ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ చదువుకుంటున్న వివిధ రాష్ట్రాల విద్యార్థులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ 'మోదీ గారు.. 'గారు 'అంటే అర్థమేంటీ..అని అడిగాడు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చెప్పారా అంటూ సరదాగా ప్రశ్నించాడు. దీనికి ప్రధాని 'నీ పేరు టోనియా.. మనోజ్ కుమారా.. అని ప్రశ్నించారు.' పూర్తి పేరు టోనీ మనోజ్ కుమార్' అంటూ ఆ విద్యార్థి సమాధానం చెప్పాడు. 'టోనీ గారు' అంటూ మోదీ మళ్ళీ పిలవడంతో కార్యక్రమంలో నవ్వులు విరిశాయి. 'గారు 'అంటే నీకు తెలుసు కదా.. మరి ఝాన్సీ వర్సిటీ విద్యార్థులకు చెప్పవా.. ' అని.. సరదాగా అడిగారు. 'ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం కాబట్టి తాను తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నట్లు ' మనోజ్ చెప్పగా.. దీనికి స్పందించిన మోదీ.. 'తప్పకుండా మాట్లాడండి తనకు బాగుంటుంది' అని అనడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.

' కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ' వ్యవసాయ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతోందని... ఇందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు' మనోజ్ కుమార్ పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో అధికంగా పండే వరి, చింతపండు, మామిడి, పొగాకు, పసుపు గంటల గురించి తన తోటి విద్యార్థులందరికీ వివరించినట్లు ' మనోజ్ వివరించాడు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు.' మనోజ్ తెలుగులో మాట్లాడిన మాటలు తనకు అర్థం అయినట్లు చెప్పారు.

సేంద్రియ సాగు వైపు రైతులు మళ్లేలా ఏమైనా ప్రయత్నాలు చేశారా..ఆ విద్యార్థిని ఉద్దేశించి ప్రధాని అడుగగా.. 'కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భూసార పరీక్షలు, వేపపూత యూరియా రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాయని, రసాయన ఎరువుల వినియోగం బాగా తగ్గిందని మనోజ్ వివరించారు. విద్యార్థులతో ప్రధాని మోదీ కలసి పోవడం.. విద్యార్థులు కూడా మనతో మాట్లాడుతున్నది.. ప్రధాని అని తెలిసి సరదా ప్రశ్నలు వేయడంతో కార్యక్రమం ఆద్యంతం సరదా సరదాగా సాగింది.