Begin typing your search above and press return to search.
అమెరికాలో తెలుగు విద్యార్థుల దుర్మరణం
By: Tupaki Desk | 29 Nov 2022 5:39 AM GMTఅమెరికాలోని మిస్సోరిలో విషాదం నెలకొంది. ఇద్దరు తెలంగాణకు చెందిన విద్యార్థులు సరస్సులో సరదాగా ఈతకు వెళ్లి మునిగిపోయారు. ఈ విషయాన్ని అక్కడి పోలీస్ అధికారులు ట్విటర్ లో ఫొటోలను షేర్ చేసి తెలిపారు. శనివారం వీకెండ్ కావడంతో సరదాగా మిస్సోరీలోని ఓజార్క్స్ సరస్సుకు వీరు వెళ్లారు. ఉత్తేజ్ (24) సరస్సులోకి వెళ్లి ఈతకొట్టాడు. అయితే తన స్నేహితుడు మునగిపోతున్నాడని శివ వెంటనే సరస్సులోకి దిగి కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు శివ కూడా మునిగిపోయాడు. కాపాడండి అంటూ కేకలు వినిపించడంతో కొందరు పోలీసులకు కాల్ చేశారు.
2.20 గంటలకు మిస్సోరి స్టేట్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉత్తేజ్ ను సరస్సులోంచి బయటకు తీశారు. శివ కోసం గాలిచినా డెడ్ బాడీ దొరకలేదు. ఆదివారం శివను రెస్క్యూ టీం పోలీసులు బయటకు తీశారు.
అప్పటికే ఇద్దరూ సరస్సులో మునిగి చనిపోయారు. వీరిని గుర్తుపట్టాలంటూ ట్విటర్ లో పోలీసులు ఫొటోలు షేర్ చేశారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు వచ్చినట్టు తేలింది.
ఈ విషయాన్ని వెంటనే ట్విటర్ ద్వారా నంద్యాల కార్తీక్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసి మృతదేహాలను తెలంగాణకు తీసుకొచ్చేలా చేయాలంటూ కోరాడు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబాలను కనుగొని వీలైనంత త్వరగా వారి మృతదేహాలు రప్పించేలా అక్కడి అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిపారు.
తానా సభ్యులు ప్రవీణ్ సింగరికొండ, శ్రీధర్, కిరణ్, తదితరులు సమన్వయం చేసి స్థానికంగా సహాయాన్ని అందించారు. శివది తాండూరు, ఉత్తేజ్ ది వరంగల్ గా గుర్తించారు. వారు సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు.
స్థానిక అంత్యక్రియల కేంద్రానికి వీరి మృతదేహాలు తరలించారు. పేపర్ వర్క్ పూర్తయ్యాక చికాగో శ్మశానవాటిక కాన్సులేట్ భారతదేశానికి పంపుతోంది. తానా బృందం వీరి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. 24 ఏళ్ల ఉతేజ్ మృతదేహాన్ని శనివారం కనుగొనగా, 25 ఏళ్ల శివ మృతదేహాన్ని డైవ్ బృందం ఆదివారం వెలికితీసింది. దీంతో తెలంగాణలోని వారి కుటుంబాల్లో విషాదం నిండింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.