Begin typing your search above and press return to search.
జేఈఈ మెయిన్స్ లో మెరిసిన తెలుగు విద్యార్థులు.
By: Tupaki Desk | 15 Sep 2021 5:09 AM GMTజేఈఈ మొయిన్స్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో తెలుగు విద్యార్థులు తమ హవాను చాటారు. మంగళవారం అర్థరాత్రి విడుదల చేసిన ఈ ఫలితాలలో దాదాపు 44 మంది అభ్యర్థులు 100శాతం సాధించడం గమనార్హం. కాగా , వారిలో 18మందికి ఫస్ట్ ర్యాంకు రావడం గమనార్హం. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.inలో చూసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, ఈ ఫలితాల కోసం పరీక్షకు హాజరైన అభ్యర్థులు మూడు రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు. కాగా, ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆరుగురు విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించారు. ఏపీ నుంచి దుగ్గినేని వెంకట పనీష్, పసల వీరశివ, కాంచనపల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంకు సాధించగా, తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకట ఆదిత్య మొదటి ర్యాంకులో నిలిచారు.
కాగా, వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థులు నలుగురు ఉండటం విశేషం. కాగా మొత్తం 9,34,602 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొమ్మ శరణ్య, జోస్యూల వెంకట ఆదిత్య ఫస్ట్ ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుగ్గినేని వెంకట పనీష్, పసల వీరశివ, కుంచనపల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంక్ సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాషల్లో నిర్వహించారు.
కాగా.. జేఈఈ మెయిన్ పరీక్షలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడం ఇదే మొదటిసారి. సెషన్ 4 కోసం మొత్తం 7.32 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెషన్ 1 లో, మొత్తం 6.61 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. సెషన్ 2, 6.19 లక్షల మంది, సెషన్ 3 లో, 7.09 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా 13 భాషలలో నిర్వహిస్తారు.