Begin typing your search above and press return to search.

అమెరికాలో మరో తెలుగు టెక్కీ కి జైలు

By:  Tupaki Desk   |   1 Feb 2020 11:43 AM GMT
అమెరికాలో మరో తెలుగు టెక్కీ కి జైలు
X
ఫార్మింగ్ టన్ యూనివర్సిటీ.. గత ఫిబ్రవరిలో అమెరికాలో అక్రమంగా నివాసం ఉండడానికి గాను ఈ యూనివర్సిటీలో ఫేక్ గా చేరి చదువుతున్నట్టు దొంగ పత్రాలు చూపించి భారతీయ విద్యార్థులు జైలు పాలయ్యారు. అత్యాధునిక, అత్యుత్తమ విద్య అంటూ యూనివర్సిటీ వెబ్ సైట్ లో గొప్పలు చెప్పి విద్యార్థులను ఆకర్షించిన ఈ ఫేక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు కటకటాల పాలయ్యారు. ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరి మోసపోయిన తెలుగు విద్యార్థులు నిండా మునిగారు. అమెరికన్ ప్రభుత్వానికి చెందిన అండర్ కవర్ ఏజెంట్లు సృష్టించిన ఈ ఫేక్ యూనివర్సిటీలో ఎక్కువగా తెలుగు విద్యార్థులే చేరి ఇప్పుడు వారి భవిష్యత్ ను అగమ్యగోచరంగా చేసుకున్నారు.

తాజాగా ఈ ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థులకు అక్రమంగా వీసాలిచ్చిన కేసులో మరో తెలుగు టెకీ ఫణిదీప్ కర్నాటికి 6 నెలల జైలు శిక్ష పడింది. శిక్ష అనుభవించాక అతడిని భారత్ కు తిప్పి పంపుతామని అమెరికా పోలీసులు తెలిపారు.

ఇప్పటికే ఈ కేసులో తెలుగు విద్యార్థులు , టెకీలకు జైలు శిక్ష పడింది. దాదాపు ఏడాది నుంచి రెండేళ్ల వరకూ పడడంతో వారు శిక్ష అనుభవిస్తున్నారు. ఫార్మింగ్టన్ కేసులో ఇప్పటికే భరత్ కాకిరెడ్డి - సురేష్ కందల - ప్రేమ్ రంపీస - సంతోష్ సామ - అవినాష్ తక్కలపల్లి - అశ్వంత్ నూనె - నవీన్ ప్రత్తిపాటి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.