Begin typing your search above and press return to search.
ఉపాధి కోసం పరాయి దేశం, కట్ చేస్తే దారుణ మోసం
By: Tupaki Desk | 31 May 2022 11:30 AM GMTఉపాధి కోసం వెళితే పరాయిదేశంలో మన వాళ్లే ఆమెకు నరకం చూపిస్తున్నారు. డబ్బు ఆశ చూపి గల్ఫ్ దేశానికి వెళ్లిన ఆమెను గదిలో బంధించారు. నాలుగురోజులు తిండితిప్పలు లేకుండా చేశారు. ఎలాగోలా ఆ మహిళ వీడియో తీసి పంపడంతో ఈ ఘోరం వెలుగుచూసింది.
జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ పేద యువతి దారుణంగా మోసపోయింది. ఆ మహిళను ఏజెంట్, అతడి మిత్రుడు మంచి ఇంట్లో పనికి కుదురుస్తామంటూ ఆమెను ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. కనీసం మహిళకు ఆహారం, నీరు అందించకుండా పస్తులు ఉంచారు. ఈ దారుణానికి ఒడిగట్టారు.
బాధిత మహిళ తన భర్తకు సోమవారం రాత్రి తన దుస్థితిని వీడియో తీసి ఫోన్ ద్వారా పంపించింది. దీంతో ఈ దారుణం వెలుగు చూసింది.
తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం బోడెవాండ్ల పల్లె పంచాయతీకి చెందిన ఓ మహిళ (26) ఈనెల 24న కువైట్ వెళ్లింది. చెంగల్ రాజు అనే ఏజెంట్ ఆమె గల్ఫ్ చేరేందుకు సహకరించారు.అక్కడికి వెళ్లాక ఓ ఇంట్లో పనికి కుదిర్చారు.
అయితే ఆ ఇంట్లో బాగోలేకపోవడంతో ఇల్లు మార్చమని ఏజెంట్ ను మహిళ కోరింది. ఏజెంట్ చెంగల్ రాజు, అతడి మిత్రుడు బావాజీ ఇదే అదునుగా ఆమెను అక్కడ ఓ గదిలో బంధించారు. ఇంకో ఇంట్లో పనికి కుదురుస్తామని హింసించారు. నాలుగురోజులుగా తిండి పెట్టకుండా నీళ్లు మాత్రమే ఇస్తున్నారని బాధితురాలు భోరున విలపించింది.
సోమవారం రాత్రి 10 గంటలకు తిరుపతిలోని తన భర్తకు వీడియో పంపింది. తనను ఎలాగైనా తిరుపతికి తీసుకొచ్చేయాలని వేడుకుంది. ఈ విషయమై బాధితురాలి భర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.