Begin typing your search above and press return to search.

పదేళ్ల ఈ చిన్నారులు అమెరికాలో మన సత్తా చాటారు

By:  Tupaki Desk   |   25 Feb 2017 4:31 AM GMT
పదేళ్ల ఈ చిన్నారులు అమెరికాలో మన సత్తా చాటారు
X

నిండా పదేళ్ల వయసు లేదు. అందులోనూ భారీ సభ్యులున్న టీమ్ కూడా కాదు. జస్ట్ ముగ్గురు. ఎంచుకున్న సబ్జెక్ట్ రోబోటిక్స్. కార్యక్షేత్రం అమెరికా. ఇలాంటి ఆసక్తికరమైన పరిణామాల మధ్య ఈ ముగ్గురు పిల్లలు 2017 వీఈఎక్స్ రోబోటిక్ వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్స్ కు ఎంపికయ్యారు. ఈ పోటీలు అమెరికాలోని కెంటకీలో ఈ ఏడాది ఏప్రిల్ 23-25 తేదీల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమం విద్యార్థులకు టీం వర్క్, ఇంజినీరింగ్ లో సమస్యలను పరిష్కరించడం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది.

అరిజోనా రాష్ర్టం నుంచి 200 టీంలు పోటీపడగా 32 టీంలు ప్రిలిమినరీ ఫేజ్ కు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. ఇందులో కేవలం 5 టీంలే ఫైనల్ కాంపిటీషన్ కు ఎంపికయ్యాయి. ఈ ఫైనల్ కు ఎంపికయిన గొప్ప మేథస్సు ఉన్న విద్యార్థుల్లో ఒంగోలుకు చెందిన సతీశ్ - పద్మ దంపతుల తనయడు సుస్మిత్ - హైదరాబాద్ కు చెందిన శ్రీకాంత్-భార్గవి దంపతుల కుమారుడు రోహిత్, అమర శ్రీకాంత్-పావనిల సుపుత్రడు సునయన ఉన్నారు.

ఆమ్ స్టర్ డమ్ అకాడమీ ఫ్రొఫెసర్లయిన మాధవి - సునీల్ జిల్లా వీరికి మెంటార్ షిప్ అందించి ఐడియల్ రోబోట్ మోడల్ ను డెవలప్ చేయించారు. ఈ చిన్నారులు ఫైనల్స్ లో విజయం సాధించి మన దేశానికి మరింత పేరును తెస్తారని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/