Begin typing your search above and press return to search.
మక్కాలో తెలుగు యూట్యూబర్ చేసిన పని.. దుమారం
By: Tupaki Desk | 3 Aug 2022 12:51 PM GMTసౌదీ అరేబియాలోని ఇస్లాంల పవిత్రమైన మక్కాను సందర్శించినట్లు తెలుగు యూట్యూబర్ చేసిన ప్రకటన ఒకవర్గాన్ని రెచ్చగొట్టినట్టైంది. ముస్లిం కాకుండా మక్కాను సందర్శించి అక్కడ సెల్ఫీ తీసుకొని మరీ పెట్టిన తెలుగు యూట్యూబర్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అతడు నిబంధనలు ఉల్లంఘించాడని.. జైల్లో పెట్టాలని ఓ వర్గం వారు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సౌదీ అరేబియా నిబంధనలను ఉల్లంఘించినందుకు.. ముస్లిమేతరులు మక్కా గ్రాండ్ మసీదులోకి ప్రవేశించడానికి అనుమతించనిందుకు అతనిపై చర్య తీసుకోవాలని కోరుతూ నెటిజన్లలో ఒక వర్గం గొడవలకు దిగుతోంది..
ఇటీవలే తెలుగు ప్రముఖ యూట్యూబర్ రవిప్రభు తాను మక్కాలోకి ప్రవేశించినట్లు ఇటీవల లైవ్ చాట్‌లో పేర్కొన్నారు. అతను తన మొబైల్లో ఒక ఫొటోను కూడా అందుకు ఫ్రూఫ్ గా చూపించాడు, అది పవిత్రమైన మక్కా మసీదు దగ్గర చేతులు పైకెత్తి ప్రార్థనతో నిలబడి ఉన్నట్లు చూపించాడు.. మరో వీడియో క్లిప్‌లో యాత్రికుడు మక్కా ప్రవేశం వద్ద కొన్ని ఖురాన్ శ్లోకాలను పఠించమని అడిగారని.. అదే పఠించినప్పుడు తనను అనుమతించారని వెల్లడించాడు. ముస్లిం కాకుండా ఇలా మక్కాను సందర్శించిన యూట్యూబర్ పై చాలా మంది మండిపడ్డారు కొందరు నెటిజన్లు అతని చర్యను తీసుకోవాలని కోరుతూ సౌదీ అధికారులను కోరారు. ఇదొక పెద్ద ఉద్యమంగానే మారింది. అతడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పెద్ద ఉద్యమమే మొదలైంది.
ఈ వివాదం నేపథ్యంలో రవి మక్కా సందర్శనకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం మానేశారు. సోషల్ మీడియాలో తదుపరి ప్రత్యక్ష ప్రసార సెషన్లలో, మక్కా గురించి ఎలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయాణికుడు నిరాకరించాడు. అతని చర్య సరైనది కాదని, చట్టబద్ధంగా లేదని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. వారిలో ఒకరు తనకు 8-10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానించారు.
నిబంధనలను ఉల్లంఘించి మక్కాలోకి ప్రవేశించినందుకు సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించే అవకాశం ఉందని మరో నెటిజన్ పేర్కొన్నాడు. మక్కాలోకి ప్రవేశించేందుకు నకిలీ ముస్లిం సర్టిఫికేట్‌ను ఉపయోగించినందుకు రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్ వినియోగదారు సౌదీ అధికారులను ట్యాగ్ చేశారు. ప్రయాణికుల వాదనలకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
రవి ‘తెలుగు ట్రావెలర్’కి 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానెల్ తెలుగులో చాలా పాపులర్. కొత్త కొత్త ప్రదేశాలను నెటిజన్లకు రవి చూపిస్తూ తన చానెల్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాను రవి సందర్శించాడు. మక్కాలో ప్రవేశించిన మొదటి తెలుగు యూట్యూబర్‌గా తనకు తాను పేర్కొన్నారు.
ఒక ఇజ్రాయెలీ జర్నలిస్ట్ మక్కాలోకి చొరబడ్డందుకు ఏకంగా మరణశిక్ష పడింది. చానల్ 13కి చెందిన గిల్ ఈ పవిత్ర నగరంలోకి ప్రవేశించి సౌదీ నిబంధనలను ఉల్లంఘించారు. సౌదీ పౌరుల ఆరోపణకు సహకరించినందుకు ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్నాడు. తాజాగా యూట్యూబర్ రవి కూడా అదే ఉల్లంఘించి ఆ దేశం దాటాక ఇది పోస్ట్ చేయడంతో బతికిపోయాడు. అత్యధికంగా ప్రయాణించే తెలుగు యూట్యూబర్ గా రవి పేరు పొందాడు. వివిధ దేశాల పర్యటనకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు. రవి ఇప్పటికే 195 దేశాలలో 187 దేశాలను సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. మక్కాలోకి ఎంట్రీ ఇచ్చి దుమారం రేపాడు.