Begin typing your search above and press return to search.

బాబును వ‌ద్ద‌న‌లేరు... లోకేష్‌ను ముద్ద‌న‌లేరు.. టీడీపీ పొలిటిక‌ల్ చిత్రం..!

By:  Tupaki Desk   |   19 Sep 2021 12:30 PM GMT
బాబును వ‌ద్ద‌న‌లేరు... లోకేష్‌ను ముద్ద‌న‌లేరు.. టీడీపీ పొలిటిక‌ల్ చిత్రం..!
X
రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. టీడీపీలో ఇది చిత్ర‌మైన ప‌రిస్థితి. పార్టీలో అనేక మంది సీనియ‌ర్లు ఉన్నారు. మ‌రెంతో మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. వీరిలో ఎంత మందికి టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి లోకేష్‌.. నాయ‌క‌త్వం ఇష్ట‌ప‌డుతున్నారు ? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యంపై ఇటీవ‌ల అంత‌ర్గ‌త స‌ర్వే జ‌రిగింది. పార్టీలో ఎంత‌మంది.. లోకేష్ బాట‌లో న‌డిచేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు ? ఎంత మంది చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్నే కోరుకుంటున్నారు? అనే విష‌యంపై నాయ‌కుల అభిప్రాయాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం జ‌రిగింది. దీనికి చాలా మంది నాయ‌కులు స్పందించ‌లేదు. ఎందుకంటే.. ఇది స‌ర్వే అని.. బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా.. నాయ‌కులు గ్ర‌హించారు.

ఈ విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించారు. ముందుగానే దీనిపై కొన్ని లీకులు కూడా వ‌చ్చాయి. దీంతో సీనియ‌ర్లు చాలా వ‌ర‌కు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. స‌రే.. ఇత‌ర నేత‌ల విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న‌వారిలో స‌గం మంది అంటే.. కేవ‌లం 8-9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే లోకేష్‌కు జైకొట్టిన‌ట్టు తెలిసింది. ఇక‌, సీనియ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. అంద‌రూ కూడా చంద్ర‌బాబు నాయ‌క‌త్వానికే జైకొట్టారు. అయితే.. ఇదంతా అత్యంత ప‌క‌డ్బందీగా.. ర‌హ‌స్యంగా.. జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా పార్టీలో తేలింది ఏమంటే.. చంద్ర‌బాబును ఇష్ట‌ప‌డుతున్న వారు.. లోకేష్‌ను ఎందుకో.. బాబు స్థాయిలో ఊహించుకోలేక పోతున్నారు. పోనీ.. మాజీ మంత్రిగా అయినా.. ఆయ‌న‌ను గుర్తిస్తున్నారా ? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు.

``లోకేష్‌.. చిన్నోడండి.. చాలా నేర్చుకోవాలి`` అన్న‌వారు తూర్పుగోదావ‌రి నుంచి ఎక్కువ‌గా క‌నిపించార‌నేది పార్టీలో గుస‌గుస‌. కొంద‌రు మాత్రం లోకేష్‌కు జై కొట్టారు. వీరిలో సీనియ‌ర్లు కూడా ఉన్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌కు టికెట్లు ఆశిస్తుండ‌డ‌మే అన్న‌ట్టుగా తెలుస్తోంది. అంటే.. యువ‌త కాబ‌ట్టి.. త‌మ వారికి టికెట్ రావాలంటే.. లోకేష్‌ను బ‌ల‌ప‌రిస్తే చాల‌నేది వీరి వ్యూహంగా క‌నిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబు మాత్రం.. లోకేష్‌పై బ‌ల‌మైన ఆశ‌లే పెట్టుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ లోకేష్ నాయ‌క‌త్వంలో ముందుకు సాగాల‌నేది ఆయ‌న వ్యూహం అయితే అయి ఉండొచ్చు. ఈ క్ర‌మంలోనే లోపాయికారీగా స‌ర్వేలు చేయించారని గుస‌గుస వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు త‌మ‌పై ఉంచుతున్న‌.. అదే.. లోకేష్ నాయ‌క‌త్వంలోనే న‌డవాల‌నే ప‌రోక్ష ఆంక్ష‌ల‌ను సీనియ‌ర్లు.. తొసిపుచ్చ‌లేక పోతున్నారు. అలాగ‌ని.. లోకేష్‌ను ఆహ్వానించ‌లేక పోతున్నారు. అంటే.. ఏతా వాతా.. చంద్ర‌బాబును వ‌ద్ద‌న‌లేరు.. అలాగ‌ని.. లోకేష్‌ను ముద్ద‌న‌లేరు... దీంతో స‌ద‌రు స‌ర్వే కాస్తా.. బుట్ట‌దాఖ‌లైంది. ఎవ‌రికి వారు.. చంద్ర‌బాబు నాయ‌క‌త్వం కావాలి.. లోకేష్ కూడా పార్టీకి అవ‌స‌రం అన్న‌వారే త‌ప్ప‌.. ఎవ‌రూ బ‌య‌ట ప‌డ‌లేదు. సో.. మొత్తానికి తేలింది ఏంటంటే.. ఇప్ప‌ట్లో టీడీపీ నాయ‌క‌త్వం మార్చ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. చంద్ర‌బాబుకు తిరుగులేని సీనియ‌ర్ల అండ మాత్రం ఉంది. సో.. టీడీపీలో లోకేష్ ప్ర‌స్థానం కోసం మ‌రో ప‌దేళ్ల‌పాటు ఫైట్ చేయాల్సిందే అంటున్నారు ప‌రిశీల‌కులు.