Begin typing your search above and press return to search.

ఎవ‌రిది అక్ర‌మం.. ఎవ‌రిది స‌క్ర‌మం.. టీడీపీ వాద‌న‌లో ప‌స‌లేదా?

By:  Tupaki Desk   |   17 Nov 2021 1:30 AM GMT
ఎవ‌రిది అక్ర‌మం.. ఎవ‌రిది స‌క్ర‌మం.. టీడీపీ వాద‌న‌లో ప‌స‌లేదా?
X
ఏపీలో `ఎవరిది అక్ర‌మం.. ఎవ‌రిది స‌క్ర‌మం..` ఇదీ.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య జోరుగా సాగుతున్న చ‌ర్చ‌. తాజాగా జ‌రిగిన.. జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు.. నెల్లూరు కార్పొరేష‌న్‌... కుప్పం మునిసిపాలిటీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న వాద‌న‌.. ప్ర‌తిప‌క్షం నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాస్తున్న లేఖ‌లు.. మీడియా ముందుకు వ‌చ్చి.. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అస‌లు ఏపీలో ఏం జ‌రుగుతోంది? ఎవ‌రు ఏం చేస్తున్నారు? అనే చ‌ర్చ ఒక్క ఏపీలోనే కాకుండా.. తెలంగాణ‌లోనూ.. చ‌ర్చ‌గా మారింది. అధికార పార్టీ స‌క్ర‌మంగా ఉంటే.. ప్ర‌తిప‌క్షం టీడీపీ అక్ర‌మంగా వ్య‌వ‌హ‌రిస్తోందా? లేక‌.. టీడీపీ స‌క్ర‌మంగా ఉంటే.. అధికార ప‌క్షం అక్ర‌మంగా వ్య‌వ‌హ‌రిస్తోందా? అనేది సీరియ‌స్‌గా మారింది.

కుప్పం మునిసిపాలిటీ.. చంద్ర‌బాబు సొంత ఇలాకా. అయితే.. ఇక్క‌డ పాగా వేయ‌డం ద్వారా.. వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. చంద్ర‌బా బును ఓడించాల‌నే ల‌క్ష్యం నెర‌వేర్చుకునేందుకు బాట‌లు స‌రిచేసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే చిన్న ఎన్నిక‌లే అయిన‌ప్ప‌టికీ (కుప్పంలో మొత్తం 35 వేల ఓట్లు ఉన్నాయి) ఇద్ద‌రు మంత్రులు(పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామి)ను రంగంలోకి దింపారు. అదేస‌మ‌యంలో ముగ్గురుఎంపీలు(రెడ్డ‌ప్ప‌, మిథున్ రెడ్డి, తిరుప‌తి ఎంపీ)ల‌ను రంగంలోకి దింపింది. ఇక‌, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ఎలానూ ఉంది. దీంతో టీడీపీ నేత‌లు స‌హ‌జంగానే ఇక్క‌డ అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. అయితే.. లేదు.. టీడీపీనే ఇక్క‌డ అక్ర‌మాలు చేస్తోంద‌ని.. వైసీపీ నాయ‌కులు ఆరోపించారు.

ఇరు ప‌క్షాలు పోటా పోటీగా ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదులు చేసుకున్నాయి. అంతేకాదు.. కుప్పంలో ఉన్న టీడీపీ మాజీ మంత్రి.. అమ‌ర్నాథ్‌రెడ్డిని, ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు వంటివారిని పోలీసులు నిర్బంధించారు. 151 కింద నోటీసులు ఇచ్చారు. మ‌రోవైపు.. కృష్ణాజిల్లాలోని జ‌గ్గ‌య్య పేట స‌హా.. గుంటూరు జిల్లా గుర‌జాల‌, దాచేప‌ల్లిలోనూ.. ఇదే త‌ర‌హా వ్యూహం కొన‌సాగింది. దీంతో టీడీపీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించింది. కానీ, అదేస‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు.. లేళ్ల అప్పిరెడ్డి వంటివారు.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఇలా మొత్తం ఎపిసోడ్‌లో ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు.

కానీ, వాస్త‌వం ప‌రిశీలిస్తే.. ప్ర‌తిప‌క్షం దూకుడు ప్ర‌ద‌ర్శించేందుకు అవ‌కాశం ఎక్క‌డుంద‌నేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. అధికార యంత్రాంగం.. పోలీసులు అంద‌రూ కూడా ప్ర‌భుత్వం చెప్పుచేత‌ల్లో ఉన్న‌ప్పుడు.. ప్ర‌తిప‌క్షానికి దూకుడు ప్ర‌ద‌ర్శించే ఛాన్స్ ఉండ‌దు క‌దా..? కానీ, వైసీపీ మాత్రం టీడీపీ అక్ర‌మాలు చేస్తోంద‌ని.. ఆరోపించ‌డం.. గ‌మ‌నార్హం. ఇక‌, టీడీపీ నేత‌లు.. వైసీపీ దొంగ ఓట‌ర్ల‌ను పట్టిచ్చారు. వైసీపీ అక్ర‌మాలు ఇవిగో అంటూ.. చూపించారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ నేత‌లు.. ఎదురు దాడి చేశారే త‌ప్ప‌.. ఆత్మ విమ‌ర్శ మాత్రం చేసుకోలేదు. మొత్తంగా చూస్తే.. అక్ర‌మాలు.. ఎవ‌రు చేశార‌నే విష‌యం స‌ర్వ‌త్రా అద్దంలో క‌నిపించినా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన ఎన్నిక‌ల క‌మిష‌న్ వైపే ఇప్పుడు అంద‌రి వేళ్లూ క‌నిపిస్తున్నాయి.