Begin typing your search above and press return to search.
దారుణం : ఎలుకలు తినేసి పసిగుడ్డు మృతి
By: Tupaki Desk | 27 Nov 2020 2:30 AM GMTఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. అలీఘడ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పసికందును ఎలుకలు తిని చంపేసిన వైనం వెలుగుచూసింది. వేలకు వేలు ఫీజులు గుంజే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ఈ దారుణం జరిగింది. 10 రోజుల పసికందును ఎలుకలు కొరికి తినేయడంతో ఆ పసిగుడ్డు ప్రాణాలు కోల్పోయిన వైనం విషాదం నింపింది. ఆ చనిపోయిన శిశువును డీప్ ప్రిజ్ లో దాచేశారు.
హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి శిశువు బలైపోవడంతో ఆ తల్లి గుండెలు అవిసేలా ఏడ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూపీలోని అలీగఢ్ లో గల రాజేశ్ కుమార్ భార్య సప్నా దేవిని ప్రసవం కోసం గత ఆదివారం కీర్తి ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. అదే రోజు రాత్రి 11 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రసవించిన తరువాత శిశువు చనిపోయిందని హాస్పిటల్ సిబ్బంది తల్లిదండ్రులకు తెలిపారు. శిశువును చూపించి డీప్ ఫ్రిజ్ లో పెట్టారు.
బిడ్డను చూపించాలని తల్లిదండ్రులు అడగడంతో మృతదేహాన్ని అప్పగించగా ఈ షాకింగ్ విషయం బయటపెట్టింది. బిడ్డను ఎలుకలు కొరికి తినేయడం వల్ల చనిపోయిందని గుర్తించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డను ఎలుకలు కొరికి తినేయటం వల్ల చనిపోయిందని గుర్తించారు. దీనిపై నిలదీయగా దురుసుగా సమాధానం చెప్పారు. దీనిపై బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బందిని విచారించారు.