Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వస్తే పట్టుమని పదిమంది రాలేదు

By:  Tupaki Desk   |   28 Jun 2021 5:34 AM GMT
ఎన్టీఆర్ వస్తే పట్టుమని పదిమంది రాలేదు
X
టాలీవుడ్ లో బడా ఫైనాన్సియర్ లలో ఒకరు నారాయణ్ దాస్ నారాంగ్.. ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారాంగ్ తండ్రి ఈయన.. చెన్నై నుంచి హైదరాబాద్ కు పరిశ్రమ తరలింపులో మొదట వచ్చిన వారిలో ఈయన ఒకరు.

చిత్ర పరిశ్రమ తొలి నాళ్లలో ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఏన్ఆర్ చిత్రాలకు ఆయన ఆర్థిక సహాయం చేశారు. ఇప్పటికీ నారాంగ్ బడాబడా పారిశ్రామికవేత్తలు, సినిమా నిర్మాతలు, హీరోలు, వ్యాపారులు ఎంతో మందికి ఫైనాన్స్ చేశారు. ఇక ఈయన దగ్గర అప్పుతీసుకుంటే కలిసి వస్తుందన్న నమ్మకం కూడా ఇండస్ట్రీలో ఉందని చెబుతారు.

ఇక నారాంగ్ తెలుగు సినిమా పరిశ్రమంలో ఒక బిగ్ షాట్. ఆయన కింద తెలంగాణ నైజాం ఏరియాలోనే ఏకంగా 60 థియేటర్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ స్టూడియోస్, అల్లు అర్జున్ తో మరోకటి.. విశాఖ, బెంగళూరుల్లో మల్టీప్లెక్స్ లు ఉన్న ఈ భారీ సినీ వ్యాపారి తనకు వ్యాపారాల్లో ఇప్పటికీ నష్టం రాలేదని.. క్రమశిక్షణను నమ్ముకుంటే ఎవరూ మోసం చేయరని చెబుతున్నారు.

తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన నారాంగ్ సీనియర్ ఎన్టీఆర్ గురించి పలు హాట్ కామెంట్స్ చేశారు. ‘ఎన్టీఆర్ పార్టీ పెడుతానని బెంగళూరులో ప్రకటించి హైదరాబాద్ వస్తే ఆయనను రిసీవ్ చేసుకోవడానికి తాను వెళ్లానని.. కనీసం పట్టుమని పదిమంది కూడా నాడు రాలేదని.. సినిమా వాళ్లు ఎవ్వరూ రాలేదని.. 10 సీట్లు కూడా ఎన్టీఆర్ కు రావు’ అని నాడు ఎద్దేవా చేశారని నారంగ్ గత అనుభవాలను నెమరువేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేసి 200పైగా సీట్లు సాధించి సీఎం అయ్యారని తెలిపారు.

ఎన్టీఆర్ తనను తెలుగుదేశం పార్టీలో చేరమని ఆహ్వానించాడని.. కానీ రాజకీయాలు సరిపడవని తాను ఊరుకున్నానని నారంగ్ తెలిపారు. ఇక గెలిచాక కూడా తనను పార్టీలోకి ఆహ్వానించిన గొప్ప మనసు ఎన్టీఆర్ ది అన్నారు.

మోడీ పాలన బాగుందని.. లా ఆర్డర్ బాగా చేస్తున్నారని.. తనకు అందరు సీఎంలతో సన్నిహిత సంబంధాలున్నాయని నారాంగ్ తెలిపారు. కేసీఆర్, వైఎస్ఆర్, చెన్నారెడ్డి, జనార్ధన్ రెడ్డిలు క్లోజ్ అని తెలిపారు. కానీ వారిని నేను ఇప్పటికీ ఏ సాయం కోరలేదని.. వాళ్లు నన్నేమీ అడగలేదని వివరించారు.