Begin typing your search above and press return to search.
చెప్పిందే చేసిన కేసీఆర్.. పది శాతం రిజర్వేషన్
By: Tupaki Desk | 8 Feb 2021 2:58 PM GMTఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదలకు పదిశాతం రిజర్వేషన్లకు సంబంధించి కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయటం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల పేదలకు పది శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కారు.. అందుకు తగ్గట్లే సీఎం కేసీఆర్ ఈ మధ్యనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్య.. ఉద్యోగం.. ఉపాధి అవకాశాల్లో ఈడ్ల్యూఎస్ రిజర్వేషన్లను కల్పిస్తారు. విద్య.. ఉద్యోగం.. ఉపాధి అవకాశాలకు రిజర్వేషన్లు పది శాతం ఉంటాయి.
దీనికి సంబందించి వివిధ శాఖల వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 21న నిర్వహించిన ఈ సమీక్షలో.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజా రిజర్వేషన్లతో కలుపుకొని అరవై శాతం రిజర్వేషన్లు అమలు కానున్నట్లు సీఎం వెల్లడించారు.
దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తాజాగా జారీ అయ్యాయి. తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ జీవో 33ను విడుదల చేశారు. అందులో ఈ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన వివరాల్ని పొందుపర్చారు. ఎయిడెడ్.. అన్ ఎయిడెడ్.. రాస్ట్ర ప్రభుత్వంలోనూ కొత్త రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వీటిని అమలు చేయనున్నారు. ఈ జీవో అమలుకు అవసరమైన అంశాలకు సంబంధించి నియమ నిబంధనల్ని తయారు చేయాల్నిన భాద్యతను సాధారణ పరిపాలనా శాఖ.. విద్యా శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మరేం జరుగుతుందో చూడాలి. మొత్తానికి సీఎం కేసీఆర్ అమలు చేస్తానని చెప్పినట్లే తాజా ఉత్తర్వులపై ఎవరెలా స్పందిస్తారో చూడాలి.