Begin typing your search above and press return to search.
పదిశాతం కోటా దక్కాలంటే.. ఇవి ఉండాల్సిందే
By: Tupaki Desk | 7 Jan 2019 12:49 PM GMTఅగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లను కల్పించే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనికోసం మంగళవారమే రాజ్యాంగ సవరణ బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్య, ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు అంటే ఎవరు? ఎవరికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి? అన్న సందేహం రావడం సహజం. ఈ రిజర్వేషన్లకు కావాల్సిన అర్హతలు ఇవి
- వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలన్నది మొదటి అర్హత.
-5 ఎకరాల లోపే వ్యవసాయ భూమి ఉండాలి
- ఇల్లు వెయ్యి చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలి
- నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100 గజాలలోపు ఇంటి స్థలం
- నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీ ప్రాంతంలో 200 గజాలలోపు ఇంటి స్థలం
ఇప్పటివరకు జనరల్ కేటగిరీలో ఉండి ఆర్థికంగా వెనుకబడినా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండేవి కావు. ఇప్పుడు వాళ్లకు కూడా పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధన నేపథ్యంలో ఇదెంత వరకు ఆచరణ సాధ్యమవుతుందో చూడాలి.