Begin typing your search above and press return to search.
దీక్ష ఏమో కానీ లోటస్ పాండ్ దగ్గర టెన్షన్..టెన్షన్
By: Tupaki Desk | 16 May 2016 7:07 AM GMTవిభజన సమయంలోనూ.. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన అలవాటు లేని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిరసనగా కర్నూలులో మూడు రోజుల దీక్ష చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ఉంటూ.. తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా.. తెలంగా ప్రాజెక్టులను అడ్డుకునేలా జగన్ వ్యవహరించటంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కర్నూలులో చేపట్టనున్న దీక్షపై వారు గుస్సా అవుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న తీరును నిరసిస్తున్న జగన్ తీరు మీద భగ్గమంటున్న తెలంగాణవాదుల కారణంగా ఏదైనా అనుకోని పరిణామం చోటు చేసుకుంటుదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్న వైఎస్ జగన్ తీరును నిరసిస్తూ.. ఆయన నివాస గృహాన్ని.. ఆయన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించాలన్న ఆలోచనలో కొందరు తెలంగాణవాదులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. ముందస్తుజాగ్రత్తగా జగన్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మొహరించరు. జగన్ కు మరింత భద్రతను పెంచారు. తాజా పరిణామాలతో లోటస్ పాండ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.