Begin typing your search above and press return to search.

ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తున్న మోత్కుపల్లి!

By:  Tupaki Desk   |   1 Nov 2021 5:33 AM GMT
ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తున్న మోత్కుపల్లి!
X
మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్‌ లో చేరగానే ఆ పార్టీ నేతలల్లో టెన్షన్ మొదలైంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఎమ్మెల్యే మోత్కుపల్లి రాక తో ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ పై అంత ఎత్తుకు ఎగిరి మరీ తీవ్రమైన విమర్శలు గుప్పించే వారి లో మోత్కుపల్లి ఒకరు. ఎడ ముఖం పెడ ముఖంగా ఉన్న కేసీఆర్, మోత్కుపల్లి మధ్య ‘దళిత బంధు’పథకం అను బంధాన్ని పెంచింది. అన్నీ మర్చిపోయి ఇద్దరు కలిసి పోయారు. టీఆర్‌ఎస్‌ లో చేరిన తర్వాత కేసీఆర్, మోత్కుపల్లి ఒకరి పై ఒకరు ప్రశంసలు గుప్పించుకున్నారు. మోత్కు పల్లి గొప్ప నేత అని కేసీఆర్ అంటే... కాదుకాదు నాకంటే గొప్ప నేత సీఎం అంటూ ఇద్దరు పోటీ పడి మరీ పొగడ్తలు గుప్పించుకున్నారు.

వలస నేతలను టీఆర్‌ఎస్‌ లోకి ఆహ్వానించిన తర్వాత అంత గా కేసీఆర్ ప్రధాన్యత ఇవ్వరనే విమర్శలున్నాయి. ఒక వేళ పార్టీ లోని తీసుకున్న.. వారికున్న పలుకు బడిని బట్టే ప్రధాన్యత ఉంటుందని టీఆర్‌ఎస్ లో చేరిన వలస నేతలు వాపోతుంటారు. మోత్కుపల్లి కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అందరూ ఊహించుకున్నారు. మోత్కుపల్లి టీఆర్‌ఎస్ లో చేరిన మరుసటి రోజే కేసీఆర్ యాదాద్రి కి వచ్చారు. ఈ పర్యటన లో కేసీఆర్ వెంట మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సఖేందర్ రెడ్డి వీరితో పాటు అధికారులున్నారు. అయితే యాదాద్రి లో అడుగు పెట్టినప్పటి నుంచి మోత్కుపల్లి ని కేసీఆర్ వదలలేదు. ఆలయ విశిష్టతను నిర్మాణ ఆవశ్యతకను మోత్కుపల్లికి కేసీఆర్ వివరించారు. ఇలా పర్యటన మొత్తం కేసీఆర్, మోత్కుపల్లి చుట్టే తిరిగింది.

దీంతో మోత్కుపల్లి కి కేసీఆర్ ఇస్తున్న ప్రధాన్యత తో నల్గొండలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట. ఆలేరు, నకిరేకల్, తుంగదుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారనే చర్చ ప్రారంభమైంది. మోత్కుపల్లి, ఆలేరు, తుంగదుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. నకిరేకల్, తుంగదుర్తి ఎస్సీ నియోజకవర్గాలు. ఆలేరు జరనల్ స్థానం. ఈ మూడింటిలో కేసీఆర్ ఏదో ఒకటి మోత్కుపల్లికి కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటని ముగ్గురు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారట. ఇదే విషయాన్ని పార్టీ అంతర్గిక సమావేశాల్లో నేతలతో చర్చించుకుంటూ వాపోతున్నానే ప్రచారం జరుగుతోంది.

అయితే మోత్కుపల్లి కి అంత సీన్ లేదని మరి కొందరు వాదిస్తున్నారు. ఆయన కు నామినేటెడ్ పదవి కేటాయించి.. దాని వరకే పరిమిత చేస్తారని ఎమ్మెల్యేలకు ధైర్యాన్ని ఇస్తున్నారట. రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ముందే చెప్పలేమని, తమ స్థానాలు పధిలం ఉంటాయో లేదో అని ముగ్గురు ఎమ్మెల్యే కనబడిన ప్రతి ఒక్కరి దగ్గర ఆరా తీసిస్తున్నారని టీఆర్‌ఎస్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ వ్యూహం ఎలా ఉందో?.. మోత్కుపల్లిని ప్రత్యక్ష రాజకీయా ల్లోకి దింపుతారో లేక నామినేటెడ్ పదవి ఇచ్చి అక్కడి తోనే పుల్ స్టాప్ పెడుతారో వేచిచూడాలి.