Begin typing your search above and press return to search.
కన్నయ్యకాక విజయవాడలో మొదలైంది
By: Tupaki Desk | 24 March 2016 4:28 PM GMTజేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ ఇపుడు కొత్త రూపంలో వస్తున్నాడు. ఢిల్లీ జేఏన్ యూలో తన గళం వినిపించిన కన్నయ్య దేశవ్యాప్త పర్యటనలకు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ లో పర్యటించి వెళ్లిన కన్నయ్య తాజాగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడకు వెళ్లారు. కన్నయ్య విజయవాడ టూర్ సందర్భంగా అక్కడ ఉద్రిక్తపరిస్థితులు ఎదురయ్యాయి.
కన్నయ్యను సభకు రానివ్వకుండా బీజేపీ నేతలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ విజయవాడ నగర కార్యాలయం వద్ద ఉద్రిక్తత, ఐవీ ప్యాలెస్ వద్ద స్వల్ప తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు .కన్నయ్యకు వ్యతిరేకంగా బీజేపీ మహిళా కార్యకర్తలు నినాదాలు చేయడం గమనార్హం.
అనంతరం ఐవీ ప్యాలెస్ సభ వద్దకు చేరుకున్న కన్నయ్య ఆవేశంగా ప్రకటించారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని విద్యార్థి సంఘం నేత కన్నయ్య స్పష్టం చేశారు. విద్యార్థి లోకం ఉద్యమిస్తే మోడీ ప్రభుత్వం కూలడం ఖాయమని అన్నారు. మోడీ మన్‌కీ బాత్..మన మన్ కీ బాత్ కాదని అన్నారు. ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.. ఇంకెప్పుడు తగ్గిస్తారని ఆయన ప్రశ్నించారు. దళిత విద్యార్థి అభ్యున్నతిని ఓర్వలేకపోయారని ఆరోపించారు. దళితులు ఆత్మగౌరవంతో విద్యను పూర్తి చేసుకునే పరిస్థితులు ఎందుకు లేకుండా పోతున్నాయని విమర్శించారు. ఆ ప్రశ్నను మన ముందు వినిపించి వెళ్లిన రోహిత్ పుట్టిన గడ్డ ఇది అని విజయవాడ సభలో కన్నయ్య వ్యాఖ్యానించారు. రోహిత్ బలిదానం వృథా పోదని అన్నారు.
ఢిల్లీలో తాము చేసిన ఉద్యమాన్ని తెలుగు ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తనను చూసేందుకో.. తన ఉపన్యాసం వినేందుకో స్థానికులు రాలేదని, తమ ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకే వచ్చారన్నారు. సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితరులు ఈ సభను క్రియాశీలంగా నిర్వహించారు. వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు భారీగా హాజరవయ్యారు.