Begin typing your search above and press return to search.

గుడివాడ‌లో టెన్ష‌న్ .. టెన్ష‌న్‌.. రెండు జిల్లాల పోలీసులు మ‌కాం!

By:  Tupaki Desk   |   24 Sep 2022 3:48 AM GMT
గుడివాడ‌లో టెన్ష‌న్ .. టెన్ష‌న్‌.. రెండు జిల్లాల పోలీసులు మ‌కాం!
X
ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని గుడివాడ‌లో టెన్ష‌న్ టెన్ష‌న్ వాతావ‌రణం నెల‌కొంది. ఏకంగా.. రెండు జిల్లాల నుంచి భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను ఇక్క‌డ‌కు ర‌ప్పించి.. మ‌కాం వేయించారు.

ఎక్క‌డ చూసినా.. పోలీసుల జీపులు.. సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లే క‌నిపిస్తున్నారు. అంతేకాదు.. పోలీసు బూటు చ‌ప్పుళ్ల‌తో.. గుడివాడ‌.. మార్మోగుతోంది. మ‌రి ఎందుకు ఇంత హ‌డావుడి.. ? ఇక్క‌డేమైనా ఉగ్ర‌మూక‌ల క‌ల‌క‌లం రేగిందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. కానీ.,. పోలీసుల హ‌డావుడి వెనుక‌.. కేవ‌లం రైతుల పాద‌యాత్ర ఉండ‌డం గ‌మ‌నార్హం. రాజ‌ధాని రైతులు చేస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0 తాజాగా గుడివాడ‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇది .. మాజీ మంత్రి , ఫైర్ బ్రాండ్ కొడాలి నాని నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. ఆయ‌న రైతుల‌పై గ‌తంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం.. రాజ‌ధానిపై చంద్ర‌బాబును దుయ్య‌బ‌ట్ట‌డం.. వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్ నెల‌కొంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. వంద‌ల సంక్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు.

ఇక‌, అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ రైతులు చేపట్టిన రెండో విడత మహాపాదయాత్ర పన్నెండో రోజుకు చేరింది. కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గానికి ఈ పాదయాత్ర చేరుకుంది. మచిలీపట్నం నియోజకవర్గం హుస్సేన్‌పాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, రైతులతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్ష నేతలు వారికి ఘనస్వాగతం పలికారు.

స్థానిక రైతులు ఎడ్లబండ్ల ర్యాలీతో అమరావతి రైతులకు మద్దతు తెలపగా.. స్థానిక మహిళలు పొలాల్లో పూలు తెచ్చి రైతులపై చల్లారు. గుడివాడ నియోజకవర్గ పల్లెలు ఆకుపచ్చ జెండాలు, జై అమరావతి నినాదాలతో మార్మోగింది.

అయితే.. మ‌రోవైపు.. పాద‌యాత్ర‌కు వ్య‌తిరేకంగా.. కొంద‌రు ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. వీటిని పోలీసులు.. తీసేయించారు. అయితే.. ఈ రాత్రికి ఏదైనా జ‌ర‌గొచ్చు.. అనే సంకేతాలు అందిన‌ట్టు.. పోలీసులు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.