Begin typing your search above and press return to search.
గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత... డీఎస్పీ కాలర్ పట్టుకున్న టీడీపీ నేతలు
By: Tupaki Desk | 22 Jan 2020 6:29 AM GMTమూడు రాజధానులకు అసెంబ్లీలో బిల్లుకు ఆమోద ముద్ర పడిన నేపధ్యంలో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని ప్రాంత రైతులు , ప్రజలు ఆగ్రహావేశాల్లో ఉన్నారు.రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన నేడు 36వ రోజు కొనసాగుతుంది. ఇక ఇదే క్రమంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. బంద్ కొనసాగుతున్నా.. రోడ్డు పైకి వచ్చి రైతులు, విద్యార్థి సంఘాలు, టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.
బంద్ నేపథ్యంలో రోడ్డుపై టీడీపీ, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాలు బాహాాబాహీకి దిగాయి. దీంతో టీడీపీ నేతలు పోలీసులపై చేయి చేసుకున్నారు. డీఎస్పీ సీతరామయ్య కాలర్‌ను పోలీసులు పట్టుకోవడంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరోవైపు అసలు బంద్‌కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా బలవంతంగా దుకాణాలు మూసి వేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
కాగా.. విద్యార్థి యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు గుంటూరులో నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కళాశాల, పాఠశాల బస్సులను అడ్డుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, తాజాగా గుంటూరు బంద్ పై పోలీసులు ప్రకటన జారీ చేశారు. బంద్ కు ఎలాంటి అనుమతులు లేవని, ఎవరూ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు నిర్వహించరాదని, బలవంతంగా షాపులు, విద్యాసంస్థలు మూయించడం చేయరాదని పోలీసులు ప్రకటించారు.