Begin typing your search above and press return to search.

సత్తెనపల్లిలో టెన్షన్..మసీదులో తలదాచుకున్న 10 మంది విదేశీయుల గుర్తింపు!

By:  Tupaki Desk   |   9 April 2020 9:10 AM GMT
సత్తెనపల్లిలో టెన్షన్..మసీదులో తలదాచుకున్న 10 మంది విదేశీయుల గుర్తింపు!
X
ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశంలో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తుంది. మన దేశంలో కూడా కరోనా విలయతాండవం చేస్తుంది. దీనితో రోడ్లపై విదేశీయులు కనిపిస్తే చాలు స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నారు. దీనికి తోడు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చారని తెలిస్తే ఆ భయం మరింత పెరిగిపోతుంది. ఇదే టెంక్షన్ ఇప్పుడు సత్తెనపల్లిలో కనిపించింది. అక్రమంగా 10 మంది విదేశీయులు తమ ప్రాంతంలో కొద్దిరోజులుగా ఉంటున్నారు అని తెలుసుకున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న ఓ మసీదులో అక్రమంగా 10 మంది విదేశీయులు ఉన్నట్టు స్థానికంగా ఉన్న వీఆర్వో గుర్తించారు. దీనిపై వెంటనే స్పందించిన సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిర్గిజ్ రిపబ్లిక్ - కజికిస్థాన్ కు చెందిన 10 మంది వ్యక్తులు విజిటింగ్ వీసాల మీద ఇండియాకు వచ్చారు. వచ్చి సత్తెనపల్లి లోని మసీదు లో తలదాచుకుంటున్నారు. లాక్ డౌన్ కారణం గానే వాళ్లు ఇండియాలో ఉండిపోయి ఉంటారని భావించినప్పటికీ.. వాళ్లకు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.

లాక్ డౌన్ టైమ్ లో విదేశీయులు - విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. అలా కుదరని పక్షంలో ఏదో ఒక ప్రభుత్వ అధికారికి ఆ సమాచారం ఇవ్వాలి అని ప్రభుత్వం తెలిపింది. అయితే , వీరు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా అక్రమంగా మసీదులో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. పైగా లాక్ డౌన్ టైమ్ లో ఢిల్లీ నుంచి వీళ్లు సత్తెనపల్లికి ఎలా రాగలిగారనే విషయం పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనితో సత్తెనపల్లి ఏరియాలో హై టెన్షన్ కొనసాగుతుంది.