Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు నిద్రపట్టకుండా చేస్తున్న కేసీఆర్
By: Tupaki Desk | 25 Feb 2020 8:30 PM GMTతెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లిన సంగతి తెల్సిందే. మున్సిపాలిటీ ఎన్నికల్లో వందకుపైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకొని తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని నిరూపించింది. కారు స్పీడుకు ప్రతిపక్ష పార్టీలన్నీ చావుదెబ్బతిన్నాయి. అయితే కొన్నిచోట్ల మాత్రం టీఆర్ ఎస్ సత్తా చాటలేకపోయింది. వీటిపై గులాబీ దళపతి నజర్ పెట్టారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పనితీరునే ప్రామాణికంగా చూస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందే ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించారు. దీనివల్లే మంచి ఫలితాలు వచ్చాయని సమాచారం.
మున్సిపల్ ఎన్నకల్లో రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటిన టీఆర్ ఎస్ కొన్ని మున్సిపాలిటీల్లో ఖాతా కూడా తెరవలేదు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని మథోల్ మున్సిపాలిటీలో టీఆర్ ఎస్ కనీసం ఖాతా తెరువ లేదు. ఇదే అక్కడి ఎమ్మెల్యేకు నిద్రలేకుండా చేస్తుందని సమాచారం. గులాబీ బాస్ తనపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడోనని టెన్షన్ పడుతున్నాడట టీఆర్ ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నుంచి ఆయన బయటకు రావడం లేదు. గులాబీ బాస్ ఎప్పుడు తనపై కన్నెర చేస్తాడనే టెన్షన్ తో ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
మథోల్ నియోజకవర్గంలోని బైంసాలో 26వార్డులు ఉండగా టీఆర్ ఎస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇక్కడ ఎంఐఎం 15 - బీజీపీ 9 - మరో రెండు ఇండిపెండెట్లు గెలుచుకున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రభావం చూపకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ స్థానంలో ఎలా గెలుస్తామని కేసీఆర్ ప్రగతిభవన్ లో నిలదీసినట్లు తెల్సింది. దీంతో అక్కడి ఎమ్మెల్యే పనితీరును కేసీఆర్ నివేదిక తెప్పించుకున్నారట.. దీంతో ఎమ్మెల్యే పై సీరియస్ యాక్షన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి తనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని నిత్యం విఠల్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా పోయిందట..
బైంసాను తమ ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం గెలుచుకోవడంతో కేసీఆర్ స్తబ్దుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో విఠల్ రెడ్డి గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అయితే స్థానికంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అన్ని విషయాల్లో వేలుపెడుతుండటంతోనే నియోజకవర్గంలో వ్యతిరేక వచ్చినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని కేసీఆర్ దృష్టి లో ఉంచుకొని విఠల్ రెడ్డికి ఒక చాన్స్ ఇస్తారా? లేక యాక్షన్ తీసుకుంటారా అనేది త్వరలోనే తేలనుంది.