Begin typing your search above and press return to search.
బీజేపీలో పెరుగుతున్న టెన్షన్!
By: Tupaki Desk | 28 Sep 2021 5:02 AM GMTసంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుకు ఉత్తరాది రాష్ట్రాల్లో బంద్ సక్సెస్ అవ్వటం బీజేపీకి బాగా ఇబ్బందిగా మారింది. మార్చా ఇచ్చిన బంద్ ఉత్తరాది రాష్ట్రాల్లో నూరుశాతం సక్సెస్ అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పాక్షికంగా విజయం సాధించింది. వ్యవసాయరంగానికి సంబంధించి నరేంద్రమోడి సర్కార్ రూపొందించిన మూడు నూతన చట్టాలకు వ్యతిరేకంగా గడచిన పదినెలలుగా భారతీయ కిసాన్ సంఘ్ నాయకత్వంలో ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలోని రైతు సంఘాల ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు దాదాపు పదినెలలుగా తమ ఊళ్ళను కుటుంబాలను, పొలాలను వదిలేసి ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తున్నారు. వేలాదిమంది రైతులు ఎంత పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నా కేంద్రమైతే వీళ్ళని ఏమాత్రం పట్టించుకోవటంలేదు. దీనికి నిరసనగానే సోమవారం భారత్ బంద్ పాటించారు. ఉత్తరాధిరాష్ట్రాల్లో ఈ బండ్ సంపర్ణంగా విజయం సాధించింది.
ఇందులో కూడా పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో అయితే సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ విషయంలోనే బీజేపీ అగ్రనేతలు+స్ధానిక నాయకత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే వచ్చే ఏడాదిలోనే పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రైతు ఉద్యమాలు ఎంతగా విజయం సాధిస్తే బీజేపీకి అంత ఇబ్బంది అన్న విషయం తెలిసిందే. రైతు సంఘాల ఆందోళన దెబ్బకే యూపీ, పంబాజ్ లో ఈమధ్యనే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.
యూపీలో అయినా పర్వాలేదు కానీ పంజాబ్ లో అయితే నామినేషన్లు వేయటానికి కూడా బీజేపీ నేతలు చాలా ఇబ్బందులు పడాల్సొచ్చింది. ఈ కారణంగానే పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేసేసింది. అన్నింటికన్నా ముఖ్యమైన సమస్య ఏమిటంటే రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న రాకేష్ తికాయత్ ది ఉత్తరప్రదేశే. పైగా తికాయత్ జాట్ సామాజికవర్గానికి చెందిన నేత. ఇపుడు జాట్లంతా బీజేపీ అంటేనే మండిపోతున్నారు.
పోయిన ఎన్నికల్లో బీజేపీకి అంతటి అఖండ విజయం దక్కిందంటే జాట్ల మద్దతు సంపూర్ణంగా దక్కటమే. అలాంటి జాట్లే ఇపుడు బీజేపీకి ఎదురుతిరిగారు. ఎప్పుడైతే రైతు ఉద్యమం మొదలైందో అప్పటినుండే బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఉద్యమ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయాలు నరేంద్రమోడికి తెలీందేమీకాదు.
ఎందుకంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో తాను ప్రతినిధ్యం వహిస్తున్న వారణాశి పార్లమెంటు పరిధిలోని అన్నీ స్దానాల్లో బీజేపీ ఓడిపోయిన విషయం మోడికి తెలుసు. అందుకనే బలమైన సామాజికవర్గాల్లో ఒకటైన బ్రాహ్మణులను మోడి దువ్వుతున్నారు. మంత్రివర్గంలోకి కొత్తగా బ్రాహ్మణులను తీసుకున్నారు. ఇలా ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. ఏదేమైనా స్ధానిక కమలనాదులను మాత్రం టెన్షన్ వదలటంలేదు. చివరకు ఏమవుతుందో ఏమో.